
తమిళ నటుడు తెలుగువారికి సైతం సత్యరాజ్ పరిచయం అక్కర్లేని పేరు. బాహుబలిలో కట్టప్పగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా వెపన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటిస్తారన్న వార్తలపై ఆయన మరోసారి స్పందించారు. నాపై వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించడం లేదని మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా చేయనని తేల్చిచెప్పారు.
డైరెక్టర్ రాజమౌళికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని సత్యరాజ్ అన్నారు. ఆయన వల్లే ఇండియా వైడ్‌గా కట్టప్పగా ఫేమస్ అయ్యానని తెలిపారు. నా డార్లింగ్ ప్రభాస్ సినిమా కల్కి రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని వెల్లడించారు. ఒకవేళ నటించే అవకాశం వస్తే.. ఛాన్స్ వదులుకోనని సత్యరాజ్ అన్నారు. కాగా.. గతంలో మోదీ జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించారు. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment