టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ఆయన ఇలా మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ ప్రాజక్ట్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. భవిష్యత్‌లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారు
మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment