కట్టప్ప పాత్రకు సూపర్ స్టార్ను అడిగారట..! | Satyaraj was not Rajamouli first choice as Kattappa | Sakshi
Sakshi News home page

కట్టప్ప పాత్రకు సూపర్ స్టార్ను అడిగారట..!

Published Wed, May 17 2017 4:30 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

కట్టప్ప పాత్రకు సూపర్ స్టార్ను అడిగారట..! - Sakshi

కట్టప్ప పాత్రకు సూపర్ స్టార్ను అడిగారట..!

బాహుబలి 2 రిలీజ్ అయి మూడు వారాలు దగ్గర పడుతున్నా.. ఆ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్తను ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. బాహుబలి 2పై అంతటి హైప్ క్రియేట్ అవ్వడానికి కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న కూడా ఓ కారణం. అయితే ఇంతటి ప్రధాన పాత్రకు ముందుగా అనుకున్న నటుడు సత్యరాజ్ కాదట.

కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు సత్యరాజ్. అయితే ఈ పాత్రకు ముందుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ను సంప్రదించారు. అప్పటికే కమిట్ అయిన సినిమాతో మోహన్ లాల్ బిజీగా ఉండటం.. ఒకే సినిమాకు బల్క్ డేట్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోవటంతో లాల్ ఈ సినిమాకు నో చెప్పాడు. అలా సత్యరాజ్ చేతికి వెళ్లిన కట్టప్ప పాత్ర ఆయన కెరీర్ లోనే అత్యుత్తమ పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement