మహాభారతగాథని వెండితెరకెక్కించేందుకు చాలా మంది ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో రాజమౌళి, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్ ఇలా చాలా మందే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వీటితో అధికారికంగా ప్రకటించిన సినిమా మాత్రం ఒక్క మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రమే.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్‌తో శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. ప్రముఖ రచయిత ఎమ్‌టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకు కావాల్సిన స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు.
అయితే నాలుగేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. నాయర్.. తన కథా కథనాలు తిరిగి ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment