br shetty
-
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
ఆశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వ్యాపారాలను సృష్టిస్తోంది.. ఆయా సామ్రాజ్యాలను కుప్పకూలుస్తుంది. కడు పేదరికంలో ఉన్నవారిని కోటీశ్వరులను చేస్తుంది.. తేడా వస్తే అథపాతాళానికి తొక్కేస్తుంది. డబ్బు మీద ఉన్న అత్యాశే ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి తన రూ.1.24 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో.. అందుకుగల కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్‌లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో మొదటి సంస్థగా..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్‌తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాలు ఇవే..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్‌ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.ఆరోపణలు.. ఆర్థిక పతనం2019లో ఎన్‌ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.1,24,000 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరందివాలా.. న్యాయ పోరాటాలుబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి. -
సేల్స్ మెన్ నుంచి బిలియనీర్‌గా, ఉడిపి నుంచి వచ్చి కటకటాలపాలయ్యాడు
ఇండియన్ అబుదాబీ బిలీనియర్ బావగుతు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టికి భారీ షాక్ తగిలింది. ఫారన్ ఎక్ఛేంజ్ బిజినెస్ ట్రాన్సాక్షన్లలో భాగంగా లండన్ బ్యాంక్ బార్క్లేస్ కు మొత్తం చెల్లించాలని లండన్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీఆర్ శెట్టి బార్క్లేస్కు 131మిలియన్లు చెల్లించాల్సి( ఇండియన్ కరెన్సీలో రూ.9,68,27,99,500) ఉంటుంది. 2020లో లంబన్ బ్యాంక్ బార్క్లేస్ ఫారన్ ఎక్ఛేంజ్ బిజినెస్ ట్రాన్సక్షన్ల ఒప్పొందంలో భాగంగా బీఆర్శెట్టి సదరు బ్యాంక్‌కు పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంది. ఇదే అంశంపై దుబాయ్ న్యాయస్థానం బీఆర్శెట్టికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. దీంతో దుబాయ్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ లండన్ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ కేసుపై గత నెల డిసెంబర్లో యూకే కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బీఆర్ శెట్టి తరుపు న్యాయ వాదులు తన క్లయింట్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, తీర్పును వాయిదా వేయాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు..కేసును జనవరి 10,2022కి వాయిదా వేసింది. నిన్న మరోసారి విచారణ చేపట్టిన లండన్ కోర్ట్ బీఆర్ శెట్టి అభ్యర్ధనను తిరస్కరించింది. ఈ సందర్భంగా బార్క్లేస్కు చెల్లించాల్సి ఉన్నా..తన క్లయింట్ బీఆర్ శెట్టి ఆస్తులు స్తంభించి పోయాయని, తీర్పును మరోసారి వాయిదా వేసేలా కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ లండన్ కోర్టు ఆ అభ్యర్ధనను తిరస్కరించింది. బీఆర్ శెట్టి బ్యాంక్ బార్క్లేస్కు 131మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఇండియాతో పాటు, మిగిలిన దేశాల్లో,లండన్‌లో ఉన్న బీఆర్ శెట్టి ఆస్తుల్ని స్తంబించేలా బార్క్లేస్ బ్యాంకు ప్రతినిధులు కోర్టు నుంచి అనుమతి పొందారు. బీఆర్ శెట్టి ఎవరు? బావగుతు రఘురామ్ షెట్టి(బీఆర్ షెట్టి) లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరు. లేని ఆస్తుల్ని ఉన్నాయని చూపించి లగ్జీరీ లైఫ్‌ను అనుభవించడంలో ఆయనకు ఆయనే సాటి. కర్ణాటక రాష్ట్రం ఉడిపి చెందిన సాధారణ కుటుంబంలో జన్మించాడు. తనకున్న విద్యా అర్హతలతో ఫార్మా రంగంలో సేల్స్‌మాన్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. ఉడిపి నుంచి 1973లో యూఏఈకి వెళ్లి అక్కడే ఫార్మసీలో క్లినికల్ డిగ్రీ పుచ్చుకున్నాడు. అనంతరం 1975లో అబుదాబిలో సొంతగా ‘ఎన్ఎంసీ హెల్త్(న్యూ మెడికల్ సెంటర్)' పేరిట ఒక మెడికల్ నెట్‌వర్క్‌ను కంపెనీని స్థాపించాడు. అనతికాలంలో వేలకోట్ల ఆస్తుల్ని సంపాదించాడు. 2019లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆయన ఇండియాలో 42వ ధనికుడు, అబుదాబీలో ఐదుగురు భారతీయ సంపన్నుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం 19 దేశాలలో 194 ఆసుపత్రులు ఉన్నాయి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు కోటీశ్వరుడి నుంచి పచ్చి మోసగాడిగా అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు. చదవండి: కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...! -
బీఆర్ శెట్టి అన్ని దొంగ లెక్కలే చూపించారు
సాక్షి, అమరావతి : భవగుత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి... అబుదాబీలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు... ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఆయన అమరావతిలో వంద ఎకరాల్లో బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా నది మధ్య ఉన్న ద్వీపాల్లో భారీ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తానని ప్రతిపాదనలు పంపారు. ధనవంతుడైన బీఆర్ శెట్టి తనను చూసి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే బీఆర్ శెట్టి అన్నీ దొంగ లెక్కలే చూపించారంటూ ‘మడీ వాటర్స్’ సంస్థ బయటపెట్టింది. 70 శాతం క్షీణించిన షేర్ ధరలు : ఎన్ఎంసీ హెల్త్‌కేర్ పేరుతో అబుదాబీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ శెట్టి ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఏకంగా లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా నమోదు చేశారు. అయితే ఈ సంస్థ ప్రకటిస్తున్న ఆదాయ వ్యయాలపై ఓ కన్నేసి ఉంచిన ప్రముఖ షార్ట్ సెల్లింగ్ (షేర్ల పతనంపై అంచనా వేస్తుంది) సంస్థ ‘కార్సన్ బ్లాక్’ అసలు విషయం తేల్చమంటూ మడీ వాటర్స్‌కు బాధ్యతలు అప్పచెప్పింది. ఇందులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. బీఆర్ శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని, చివరికి తన వాటాగా ఉన్న షేర్లను బ్యాంకులకు తనఖా పెట్టడమే కాకుండా, ఇతర భాగస్వాములకూ వాటాలు విక్రయించిన విషయాన్ని వెల్లడించింది. విదేశీ సంస్థలను అధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా అకౌంట్స్‌లో చూపించారని, ఖాతాల్లో నగదు నిల్వలను ఎక్కువ చేసి చూపారని పేర్కొంది. వాస్తవ రుణాలను కూడా తక్కువ చేసి చూపిన వైనాన్ని బయటపెట్టింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎన్ఎంసీ షేరు ధర సుమారు 70 శాతం క్షీణించింది. దీంతో తనఖా పెట్టిన షేర్లను ఫస్ట్ అబుదాబీ బ్యాంక్, ఫాల్కన్ ప్రైవేట్ బ్యాంకులు అమ్మేశాయి. ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు రోజుల క్రితం చైర్మన్ పదవి నుంచి బీఆర్ శెట్టి తప్పుకున్నారు. -
ఆ భారీ బడ్జెట్ చిత్రం ఆగిపోయింది!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో మహా భారతగాథను తెరకెక్కిస్తున్నట్టుగా చాలా కాలం క్రితమే ప్రకటించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి, శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. సినిమాను తెరకెక్కించేందుకు వీలుగా నవలను మార్చి స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే సినిమా ప్రకటించి మూడేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ చాలా రోజుల కిందటే నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిర్మాత బీఆర్ శెట్టి అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ మహా భారతం ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. రచయితం దర్శకుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రకటించారు. -
చిక్కుల్లో 1000 కోట్ల ‘మహాభారతం’
మహాభారతగాథని వెండితెరకెక్కించేందుకు చాలా మంది ఫిలిం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్లో రాజమౌళి, బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్ ఇలా చాలా మందే ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వీటితో అధికారికంగా ప్రకటించిన సినిమా మాత్రం ఒక్క మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రమే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్‌తో శ్రీకుమార్ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు నిర్ణయించారు. ప్రముఖ రచయిత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన రంధమూలం నవల ఆధారం సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకు కావాల్సిన స్క్రీన్‌ప్లేను కూడా వాసుదేవన్ నాయరే సమకూర్చారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న ఇంత వరకు సినిమా ప్రారంభించకపోవటంపై రచయిత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కేవలం మూడేళ్లకే చేయించుకున్నారని.. అయినా తాను మరో ఏడాది పాటు ఎక్కువగా ఎదురుచూసినా షూటింగ్ పనులు ఇంకా ప్రారంభించలేదంటూ దర్శక నిర్మాతలపై ఫైర్ అయ్యారు. నాయర్.. తన కథా కథనాలు తిరిగి ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది. -
ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతాం
యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పారిశ్రామికవేత్త సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి చూపారు. హెల్త్‌కేర్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బీఆర్ షెట్టి సూచనప్రాయంగా అంగీకరించారు. తెలంగాణ గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని, ఇప్పుడు మంత్రిని కలసి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. సంస్థ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల వివరాలను వివరించారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తులకు రాజధానిగా అభివృద్ధి చెందిందని, లైఫ్‌సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా అధికంగా పెట్టబడులు వస్తున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మా ఆస్పత్రుల్లో ఉద్యోగాలిస్తా.. రండి!!
ఇరాక్ అల్లర్ల పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉగ్రవాదుల చెరలో చిక్కి, ఎట్టకేలకు మాతృభూమికి తిరిగివెళ్లిన 46 మంది నర్సులకు తన ఆస్పత్రులలో ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ఒకరు పిలిచారు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఆస్పత్రులున్న బీఆర్ శెట్లి వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కేరళలోని వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. తిక్రిత్‌లో ఉన్న ఈ నర్సులను సున్నీ తీవ్రవాదులు మోసుల్కు తీసుకొచ్చి.. చివరకు శుక్రవారం నాడు కుర్దిష్ రాజధాని ఎర్బిల్‌లో విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో వాళ్లంతా భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈ సహా పలు దేశాల్లో శెట్టికి చెందిన ఎన్ఎంసీ గ్రూపునకు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి.