కట్టప్ప క్షమాపణ చెప్పాలి..
బొమ్మనహళ్లి : కన్నడ ప్రజలకు, కావేరి నీటి విషయంలో చులకనగా మాట్లాడిన బాహుబలి కట్టప్ప పాత్రదారుడు, తమిళనటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు సత్యరాజ్‌కు వ్యతిరేకంగా మంగళవారం బొమ్మన హళ్లిలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కోడిచిక్కనహళ్లి రోడ్డు నుంచి బేగూరు రోడ్డులో బొమ్మనహళ్లి సర్కిల్ వరకు సత్యరాజ్ దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించారు.
బెంగళూరు నగర జిల్లా సంచాలకుడు ఎస్.రాజేష్ మాట్లాడుతూ.. సత్యరాజ్ కన్నిడిగులకు క్షమాపణ చెప్పని పక్షంలో బాహుబలి–2 సినిమాను నగరంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేశారు. బొమ్మనహళ్లి కార్యాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు సయ్యద్ దస్తగిరి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి చంద్రమోహన్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.