Kattapa
-
బీటౌన్ కట్టప్ప పొడిచేశాడు!
కొత్త కట్టప్ప వచ్చాడు. ఈయనది బీటౌన్. ఈ కట్టప్పకు జుట్టుంది, ‘బాహుబలి’లో కట్టప్పకు లేదు. కానీ, మిగతాదంతా సేమ్ టు సేమ్! ఇద్దరూ చేసిందొక్కటే! ప్రభాస్‌ను వెన్నుపోటు పొడిచారు. వెనక నుంచి కత్తితో ఓ పోటు పొడిచారు. ‘బాహుబలి’లో సత్యరాజ్ వెన్నుపోటు సీరియస్ అయితే... ఈ బీటౌన్ కట్టప్ప కత్తిపోటు సరదా కోసం చేసింది. బీటౌన్ అంటే బాలీవుడ్. ఆ కట్టప్ప ఎవరో కాదు... యంగ్ హీరో వరుణ్ ధావన్. ‘బాహుబలి’ హిందీ వెర్షన్ విడుదల చేసిన దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మొన్న రాత్రి బీటౌన్‌లో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి సక్సెస్ పార్టీ ఇచ్చారు. అందులో ఈ ఫన్నీ సీన్ చోటు చేసుకుంది. రానా దగ్గుబాటి, వరుణ్ ధావన్, ఆలియా భట్ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు. ఇంతకీ, ఈ వరుణ్ ధావన్ ఎవరంటే... ఈవీవీ ‘హలో బ్రదర్’ను హిందీలో ‘జుడ్వా’గా రీమేక్ చేసిన దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. ఇప్పుడీ తండ్రీకొడులు ‘హాలో బ్రదర్’కి సీక్వెల్‌గా హిందీలో ‘జుడ్వా–2’ చేస్తున్నారు. #bahubali . Did only what #katappa did before this. #Prabhas is really cool and down to earth more power to him but iv got his sword now. pic.twitter.com/2EtAl98b1D — Varun Dhawan (@Varun_dvn) 20 June 2017 -
బ్రహ్మదేవుడే వచ్చి బతిమాలినా ఒప్పుకోం..
► చిక్కలో నటుడు సత్యరాజ్ దిష్టిబొమ్మ దహనం ► కట్టప్ప క్షమాపణ చెప్పాల్సిందే : వాటాళ్ నాగరాజు సాక్షి, బెంగళూరు: సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కన్నడ భాషలో మాట్లాడినా కూడా బాహుబలి–2 విడుదలకు ఒప్పుకునేది లేదని, తమిళనటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ చళవళి పార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు స్పష్టం చేశారు. చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాహుబలి దర్శకుడు రాజమౌళి విడుదలకు సహకరించాలని రికార్డెడ్ వీడియోలో కోరిన సందర్భంగా స్పందిస్తూ సత్యరాజ్పైనే తమ పోరాటమని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఈనెల 28న బెంగళూరు బంద్ నిర్వహిస్తామని అఆన్నరు. కన్నడ సినిమా రంగం కూడా ఇందుకు మద్దతు ఉందని అన్నారు. 21న సత్యరాజ్ శవయాత్ర నిర్వహిస్తామని వాటాళ్ చెప్పారు. కట్టప్ప క్షమాపణ చెప్పాలిందే ! చిక్కబళ్లాపురం : కావేరి విషయంలో కన్నడ ప్రజలను అపహాస్యంగా మాట్లాడిన నటుడు సత్యరాజ్ క్షమాపణ చెబితేనే బాహుబలి–2 విడుదల సమ్మతిస్తామని కరవే నాయకులు హెచ్చరించారు. గురువారం ఇక్కడి శిడ్లఘట్ట సర్కిల్లో కరవే కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నటుడు సత్యరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... సత్యరాజ్ క్షమాపణ చెప్పే వరకు కర్ణాటకలో బాహుబలి–2ను విడుదల చేస ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కరవే నాయకులు మంజునాథ్, కేశవమూర్తి, భరత్ కుమార్, చంద్రశేఖర్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. మండ్యలో కరవే ధర్నా తమిళ నటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలను క్షమాపణ కోరాలని, అప్పటి వరకు రాష్ట్రంలో బాహుబలి–2 విడుదలకు అనుమతించమని కర్ణాటక రక్షణ వేదిక (ప్రవీణ్ శెట్టి) కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం సత్యరాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
కట్టప్ప క్షమాపణ చెప్పాలి..
బొమ్మనహళ్లి : కన్నడ ప్రజలకు, కావేరి నీటి విషయంలో చులకనగా మాట్లాడిన బాహుబలి కట్టప్ప పాత్రదారుడు, తమిళనటుడు సత్యరాజ్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు సత్యరాజ్‌కు వ్యతిరేకంగా మంగళవారం బొమ్మన హళ్లిలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు కోడిచిక్కనహళ్లి రోడ్డు నుంచి బేగూరు రోడ్డులో బొమ్మనహళ్లి సర్కిల్ వరకు సత్యరాజ్ దిష్టిబొమ్మకు శవ యాత్ర నిర్వహించారు. బెంగళూరు నగర జిల్లా సంచాలకుడు ఎస్.రాజేష్ మాట్లాడుతూ.. సత్యరాజ్ కన్నిడిగులకు క్షమాపణ చెప్పని పక్షంలో బాహుబలి–2 సినిమాను నగరంలో విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం దిష్టి బొమ్మను దహనం చేశారు. బొమ్మనహళ్లి కార్యాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు సయ్యద్ దస్తగిరి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి చంద్రమోహన్గౌడ తదితరులు పాల్గొన్నారు.