Actor Sathyaraj Discharged From Hospital Days After Covid 19 Positive - Sakshi
Sakshi News home page

Actor Satya Raj: ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన ‘కట్టప్ప’, కొద్ది రోజుల పాటు విశ్రాంతి..

Published Tue, Jan 11 2022 4:42 PM | Last Updated on Tue, Jan 11 2022 6:22 PM

Actor Sathyaraj Discharged From Hospital Days After Covid 19 Positive - Sakshi

ప్రముఖ నటుడు, బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యరాజ్‌ తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడంతో సత్యరాజ్‌ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్‌ అంతా ఆందోళనకు గురయ్యారు. (చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక)

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. 

ఈ  నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు శిబి సత్యరాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ప్రస్తున్నా నాన్న(సత్యరాజ్‌) క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశాడు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని... ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని ఆయన కుమారుడు పేర్కొన్నాడు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా సత్య రాజ్‌ తనయుడైన శిబి సత్యరాజ్‌ మాయోన్‌ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement