Angarakan Movie Fame Sathyaraj Says Rajinikanth Is Real Super Star - Sakshi
Sakshi News home page

Sathyaraj: రజనీకాంత్‌ మాత్రమే నిజమైన సూపర్‌ స్టార్‌..

Published Mon, Aug 21 2023 1:25 PM | Last Updated on Mon, Aug 21 2023 1:47 PM

Angarakan Movie Fame Sathyaraj Says Rajinikanth is Real Super Star - Sakshi

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ మళ్లీ విలన్‌ అవతారమెత్తారు. జూలియన్‌ అండ్‌ జీరో మా ఇంటర్నేషనల్‌ పతాకంపై జోమోన్‌ ఫిలిప్‌, జీనా రోమోన్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం అంగారకన్‌. శ్రీపతి కథానాయకుడిగా నటించి, కథనం, క్రియేటివ్‌ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ సినిమాలో సత్యరాజ్‌ డేరింగ్‌ పోలీస్‌ అధికారిగా ప్రతినాయకుడి పాత్రలో నటించారు. మలయాళ బ్యూటీ నియా కథానాయకిగా నటించింది. ఈ చిత్రంలో అంగాడి తెరు ఫేమ్‌ మహేష్‌, రెయినా కారత్‌, రోషన్‌, అప్పుకుట్టి, దియా, నేహా రోస్‌, గురు చంద్రన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రభాస్‌ కాలును మీ తలపై పెట్టుకోవాలి.. ఓకేనా?
దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్‌ డచ్చు ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అంగారకన్‌ సెప్టెంబర్‌ 8వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో చిత్ర యూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. నటుడు సత్యరాజ్‌ మాట్లాడుతూ.. చిత్ర దర్శకుడు శ్రీపతి తనకు కథ చెప్పే ముందే ఇందులో తాను హీరో, మీరు విలన్‌ ఓకేనా అని అడిగారన్నారు. బాహుబలి చిత్రంలో నటించినప్పుడు దర్శకుడు రాజమౌళి కూడా ఇలానే అడిగారన్నారు. ప్రభాస్‌ కాలును మీ తలపై పెట్టుకోవాలి అందుకు ఓకేనా..? అని ఆయన అడిగారన్నారు.

అలా బోర్‌ కొట్టేసింది..
ఈ చిత్ర దర్శకుడు శ్రీపతి కథ పూర్తిగా చెప్పగా తనకు నచ్చిందన్నారు ఇందులో నటించడానికి మంచి అవకాశం ఉందన్నారు. వరుసగా తండ్రి పాత్రల్లో నటించడం బోర్‌ కొట్టడంతో మంచి విలన్‌ పాత్ర వస్తే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభించడం అనేది ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయం అన్నారు. అయితే ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం కూడా రాజకీయమేనని, అలాంటి వారి వెనుక తాను ఉంటానని చెప్పారు. సూపర్‌ స్టార్‌ చర్చ గురించి మాట్లాడుతూ.. ఎళిసై మన్నర్‌, మక్కల్‌ తిలకం, నడిగర్‌ తిలకం అంటూ కాలానికి తగ్గట్టుగా పట్టం మారుతూ ఉంటుందని తనకు తెలిసినంతవరకు నటుడు రజనీకాంత్‌ మాత్రమే నిజమైన సూపర్‌ స్టార్‌ అని సత్యరాజ్‌ పేర్కొన్నారు.

చదవండి: అడ్డగోలు పారితోషికాలు, అవసరం లేని రికార్డులు.. సినీ పరిశ్రమకే ‘మెగా ’కష్టం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement