Sathyaraj, Vasanth Ravi 'Weapon' Movie Highlights - Sakshi
Sakshi News home page

Satya Raj: సూపర్‌ మాన్‌గా కట్టప్ప, కానీ ఎవ్వర్నీ కాపాడడట!

Published Wed, Aug 2 2023 3:40 PM | Last Updated on Wed, Aug 2 2023 3:57 PM

Sathyaraj, Vasanth Ravi Movie Weapon Highlights - Sakshi

నటుడు, బాహుబలి 'కట్టప్ప' సత్యరాజ్‌, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్‌. చాగల్లు సురేష్‌ మేళం, నటి తాన్య హోప్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో పతాకంపై ఎంఎస్‌ మంజూర్‌ నిర్మిస్తున్నారు. గుహన్‌ సినీయప్పన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దర్శకుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్‌ చిత్రాలు సూపర్‌ మాన్‌, సూపర్‌ వుమెన్‌ చిత్రాల తరహాలో సాగే మరో భవిష్య భరిత కథా చిత్రం వెపన్‌ అని చెప్పాడు.

ఇందులో నటుడు సత్యరాజ్‌ సూపర్‌ మాన్‌గా నటించారన్నాడు. అయితే ఆయనకు ఆ ఆసక్తి ఎలా వచ్చిందన్నది సస్పెన్స్‌ అన్నారు. ఆయన్ని చంపడం ఎవరి తరం కాదన్నాడు. హాలీవుడ్‌ చిత్రాల్లో ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రపంచాన్ని సూపర్‌ హీరోలు కాపాడతారని, ఈ చిత్రంలో సత్యరాజ్‌ తన శక్తితో ఎవరినీ కాపాడకుండా తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటారని పేర్కొన్నాడు. ఇందులో ఆయన అడవిలో దారి తప్పిన ఏనుగులను కాపాడే వ్యక్తిగా నటించారన్నాడు.


సత్యరాజ్‌కి సీన్‌ వివరిస్తున్న దర్శకుడు

ఫిదా నటుడు వసంత రవి బయట ప్రపంచంలోని అద్భుత వ్యక్తుల గురించి పరిచయం చేసే యూట్యూబర్‌గా నటించినట్లు చెప్పాడు. సురేష్‌ వేణు ప్రతి నాయకుడిగా నటించారని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్‌ బ్యాక్‌లో నటుడు సత్యరాజ్‌ చాలా యంగ్‌గా కనిపిస్తారన్నాడు. అందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు వెల్లడించాడు. నిర్మాత ఎమ్మెస్‌ ముంజూర్‌ మాట్లాడుతూ వెపన్‌ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. మరో విషయం ఏంటంటే దీన్ని హాలీవుడ్‌ చిత్రాల తరహాలో పలు ఫ్రాంచైజీలుగా రూపొందించనున్నట్లు చెప్పాడు.

చదవండి: ఇకపై నరేశ్‌ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. తీర్పు వెల్లడించిన కోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement