Vasanth Ravi
-
సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్!
సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. మిలియన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్ మీనన్ ప్రతినాయకుడిగా ఫవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్ మీట్ నిర్వహించింది.దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ..' సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్ మన్సూర్, ఎంఎస్ అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ ఐజీష్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్ తొలిసారిగా సూపర్ హ్యూమన్ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.ఇక నటుడు వసంతరవి స్క్రీన్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్ కరీమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది. -
రజనీతో నటిస్తానని ఊహించలేదు, జైలర్ సీక్వెల్..: నటుడు
జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని నటుడు వసంత్ రవి పేర్కొన్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నారు. చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న ఈయన ఆ తరువాత రాఖి అనే పుల్ యాక్షన్ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత అశ్విన్స్ అనే కథా చిత్రంలో నటించి సక్సెస్ అయ్యారు. అలాగే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం జైలర్‌లో వసంత రవి ఆయనకు కొడుకుగా ముఖ్యపాత్రను పోషించారు. రజనీతో పనిచేయడం.. అలాగే ఇటీవల అశోక్‌సెల్వన్‌తో కలిసి పొన్ ఒండ్రు కండేన్ చిత్రంలో నటించారు. జి.స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఏప్రిల్ 18న వసంత్ రవి పుట్టినరోజు కాగా చెన్నైలో ఆయన తన జర్నీ గురించి మాట్లాడారు. తాను మొదటి నుంచి డిఫరెంట్ బ్యానర్లలో నటిస్తున్నట్లు చెప్పారు. జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. జైలర్ 2లో? తాను నటుడుగా పరిచయం అయ్యే ముందు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నానని, అయితే ఆ తరువాత ఆయనతో కలిసి నటిస్తానని ఊహించలేదన్నారు. జైలర్–2 చిత్రంలో నటిస్తారా? అని అడుగుతున్నారని, వాస్తవానికి ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదన్నారు. దాని గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. అదే నా లక్ష్యం అన్ని రకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం వెపన్, ఇంద్ర చిత్రాల్లో నటిస్తున్నానని, ఇవి చాలా వైవిధ్య కథా చిత్రాలుగా ఉంటాయన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. ఇంకా మంచి చిత్రాలు చేయాలన్నదే తన కోరిక అని వసంత్ రవి పేర్కొన్నారు. చదవండి: Vishal: జగన్ తప్పకుండా మళ్లీ గెలుస్తారు -
డైరెక్ట్‌గా ఓటీటీకి ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అశోక్ సెల్వన్, వసంత్ రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రియ దర్శకత్వంలో తెరకెక్కించారు. జియో స్టూడియోస్, వైఎస్ఆర్ ఫిలింస్ బ్యానర్లపై యువన్ శంకర్ రాజా, జ్యోతి దేశ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే మొదట ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అనివార్య కారణాలతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తాజాగా పొన్ ఒండ్రు కండేన్ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో సినిమాలో ఈ రోజు నుంచే స్ట్రీమింగా కానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజవుతోంది. అంతే కాకుండా కలర్స్ టీవీ తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. ఈ చిత్రంలో దీపా శంకర్, సచ్చు కీలక పాత్రలు పోషించారు. #PonOndruKanden is a light hearted fun film, with my buddies @iamvasanthravi and @AishuL_ , directed by @directorpriya_v and music by thalaivan @thisisysr 💥 The film is coming directly to your home, through @JioCinema and @ColorsTvTamil on April 14th. Watch it with your… pic.twitter.com/CMUBcWbNku — Ashok Selvan (@AshokSelvan) April 11, 2024 -
షాకింగ్.. థియేటర్లో కాకుండా నేరుగా టీవీలోకి వస్తున్న సినిమా
తమిళహీరోలు అశోక్ సెల్వన్, వసంత్ రవి, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పొన్ ఒండ్రు కండేన్'. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. కానీ ఇంతలో అందరికీ షాకిస్తూ నేరుగా టీవీలో విడుదల చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ సినిమాను కలర్స్ తమిళ్ అనే ఛానల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంటూ ప్రోమో కూడా వదిలింది. ఇలా చేశారేంటి? ఇది చూసిన వసంత్ రవి ఆవేదన వ్యక్తం చేశాడు. 'షాకింగ్‌గా ఉంది. ఇది నిజమేనా? జియో స్టూడియోస్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. సినిమాలో నటించినవారికిగానీ, డైరెక్టర్‌కుగానీ.. అసలు సినిమాతో సంబంధమున్న ఏ ఒక్కరికీ కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా టీవీలో రిలీజ్ చేస్తుండటం చాలా బాధగా ఉంది. ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాం.. థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా టీవీలోకి వస్తుందంటే మా మనసు ముక్కలవుతోంది. ఇంత మర్యాద చూపించారు పొన్ ఒండ్రు కండేన్ సినిమా టీమ్‌కు ఎవ్వరికీ ఈ విషయం తెలియకపోవడం నిజంగా విచారకరం. సోషల్ మీడియా ద్వారా అందరితోపాటు మాకూ ఒకేసారి టెలివిజన్ ప్రీమియర్ గురించి ఇంత మర్యాదగా, గొప్పగా చెప్పినందుకు జియో స్టూడియోస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి సినిమా కమర్షియల్ అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆర్టిస్టులకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తెలుసుకునే హక్కు మాకుంది' అని రాసుకొచ్చాడు. దీంతో జియో స్టూడియో సదరు పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. Shocking !! Is this even True ?? Especially from a reputated and leading production house like @jiostudios. Extremely painful and disheartening to see the promo of #PonOndruKanden and announcement of World Satellite Premiere without any communication to @AshokSelvan,… https://t.co/Q4HT74Gyxx — Vasanth Ravi (@iamvasanthravi) March 14, 2024 -
బైక్ ర్యాలీలో స్టార్ హీరోయిన్.. అదే కారణమా?
మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన చిత్రం 'వెపన్'. సత్యరాజ్, వసంత రవి, తాన్య హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గుహన్ చెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ కిల్లర్ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) కాగా చిత్ర నిర్మాత ఆదివారం ఉదయం ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు అవగాహన కలిగించే విధంగా వేర్ హెల్మెట్ పేరుతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వసంత రవి, తాన్య హోప్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత మన్సూర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. టూ వీలర్స్ హెల్మెట్లు ధరించాల్సిన ఆవశ్యకత, సురక్షితంగా వాహనాలను నడపడం గురించి అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు స్థానిక ఓఎంఆర్ రోడ్లో ప్రారంభమై తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతం వరకు సాగింది. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!
సినిమాల్లో కేవలం హీరోయిన్ల కోసం వచ్చే ప్రేక్షకులూ ఉంటారన్నది వాస్తవం. కొన్నిసార్లు ఈ కారణంగానే దర్శక నిర్మాతలు యువ హీరోల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. తాజాగా హీరో వసంత రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు వసంత రవి. ఆ తర్వాత రాఖి చిత్రంతో యాక్షన్ హీరోగా విజయాన్ని అందుకున్నారు. ఇటీవల అశ్విన్స్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమయ్యారు. జేఎస్ఎం పిక్చర్స్, ఎంపీరర్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శబరీష్ నందా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా వసంత రవికి జంటగా పటాస్, నోటా చిత్రాల ఫేమ్ మెహ్రీన్, హీరోయిన్ అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. అజ్మల్ దాసిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. టైటిల్ సహా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నాడు. చదవండి: Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్! -
కట్టప్ప కొత్త సినిమా.. AI టెక్నాలజీతో యంగ్ లుక్‌లో..
నటుడు, బాహుబలి 'కట్టప్ప' సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. చాగల్లు సురేష్ మేళం, నటి తాన్య హోప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో పతాకంపై ఎంఎస్ మంజూర్ నిర్మిస్తున్నారు. గుహన్ సినీయప్పన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం దర్శకుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్ చిత్రాలు సూపర్ మాన్, సూపర్ వుమెన్ చిత్రాల తరహాలో సాగే మరో భవిష్య భరిత కథా చిత్రం వెపన్ అని చెప్పాడు. ఇందులో నటుడు సత్యరాజ్ సూపర్ మాన్‌గా నటించారన్నాడు. అయితే ఆయనకు ఆ ఆసక్తి ఎలా వచ్చిందన్నది సస్పెన్స్ అన్నారు. ఆయన్ని చంపడం ఎవరి తరం కాదన్నాడు. హాలీవుడ్ చిత్రాల్లో ముంచుకొస్తున్న ముప్పు నుంచి ప్రపంచాన్ని సూపర్ హీరోలు కాపాడతారని, ఈ చిత్రంలో సత్యరాజ్ తన శక్తితో ఎవరినీ కాపాడకుండా తన వ్యక్తిగత విషయాల కోసం వాడుకుంటారని పేర్కొన్నాడు. ఇందులో ఆయన అడవిలో దారి తప్పిన ఏనుగులను కాపాడే వ్యక్తిగా నటించారన్నాడు. సత్యరాజ్‌కి సీన్ వివరిస్తున్న దర్శకుడు ఫిదా నటుడు వసంత రవి బయట ప్రపంచంలోని అద్భుత వ్యక్తుల గురించి పరిచయం చేసే యూట్యూబర్‌గా నటించినట్లు చెప్పాడు. సురేష్ వేణు ప్రతి నాయకుడిగా నటించారని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో నటుడు సత్యరాజ్ చాలా యంగ్‌గా కనిపిస్తారన్నాడు. అందుకోసం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు వెల్లడించాడు. నిర్మాత ఎమ్మెస్ ముంజూర్ మాట్లాడుతూ వెపన్ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. మరో విషయం ఏంటంటే దీన్ని హాలీవుడ్ చిత్రాల తరహాలో పలు ఫ్రాంచైజీలుగా రూపొందించనున్నట్లు చెప్పాడు. చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. తీర్పు వెల్లడించిన కోర్టు -
అశ్విన్స్ సక్సెస్.. బాధ్యత మరింత పెరిగిందన్న హీరో
తరమని చిత్రంతో నటుడుగా తనదైన ముద్రవేసుకున్న వసంత రవి ఆ తర్వాత రాఖీ చిత్రంతో మాస్ హీరోగా ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం అశ్విన్స్. 25 రోజుల క్రితం విడుదలైన ఈ వైవిధ్యభరిత హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేటికీ థియేటర్లలో కొనసాగుతోంది. దీంతో హీరో వసంత రవి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో చిత్ర యూనిట్ రేయింబవళ్లు కష్టపడి రూపొందించిన చిత్రం అశ్విన్స్ అని పేర్కొన్నారు. పలు సమస్యలను ఎదురొడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. ఇది పరిచయంలేని ముఖాలతో తక్కువ బడ్జెట్లో నిర్మించిన చిత్రమన్నది తెలిసిందేనని, ఇలాంటి చిత్రాలు థియేటర్లో వారానికి పైగా ప్రదర్శించడం సవాల్‌తో కూడిన పని అని తెలిపారు. అలాంటిది ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం 25 రోజులు దాటి ప్రదర్శితమవడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి విజయానికి కారణమైన చిత్ర దర్శకుడు తరుణ్ తేజా, నిర్మాత బాపినీడు, తమను నమ్మి ఇందులో భాగస్వామ్యం పంచుకున్న ప్రవీణ్‌లకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఛాలెంజింగ్ కథలను, పాత్రలను ఎంపిక చేసుకుని తన పరిధిని పెంచుకుంటూ.. నటనా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మీరందరూ మెచ్చుకునే విధంగా తన చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని వసంత రవి అన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఈయన ముఖ్యపాత్రను పోషించారన్నది తెలిసిన విషయమే! చదవండి: బేబి సినిమాకు వీళ్ల రెమ్యునరేషన్ ఇంత తక్కువా? -
'విశ్వాసం’ సినిమా అజిత్ కూతురితో మెహరీన్
‘ఎఫ్ 3’ (2022) తర్వాత మెహరీన్ తెలుగులో సినిమాలు కమిట్ కాలేదు. తాజాగా తమిళంలో ఓ కొత్త చిత్రంలో హీరోయిన్గా నటించడానికి అంగీకరించారు. శబరీష్ నంద దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో వసంత్ రవి హీరో. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఇందులో సునీల్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘విశ్వాసం’లో హీరో అజిత్ కూతురి పాత్రలో కనిపించిన అనిఖా సురేంద్రన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. -
సరికొత్త అనుభూతినిస్తుంది
‘‘తరుణ్ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్ జోనర్లో ‘అశ్విన్స్’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వసంత్ రవి హీరోగా, విమలా రామన్ కీ రోల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ– ‘‘అశ్విన్స్’ కాన్సెప్ట్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘అశ్విన్స్’ తరుణ్ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విమలా రామన్. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అశ్విన్స్’ వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది’’ అన్నారు వసంత్ రవి. -
Asvins Review: ‘అశ్విన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్విన్స్ నటీనటులు: సంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: తరుణ్ తేజ సంగీతం: విజయ్ సిద్ధార్థ్ విడుదల తేది: జూన్ 23, 2023 థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మీడియా కోసం ఈ మూవీ ప్రివ్యూ వేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో రివ్యూలో చూద్దాం. అశ్విన్స్ కథేంటంటే.. అర్జున్(వసంత్ రవి), రీతు, రాహుల్, గ్రేస్, వరుణ్..ఐదుగురు యూట్యూబర్స్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని లండన్‌లోని ఓ దీవిలో ఉన్న భవంతికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడి వెళ్లిన ఓ 15 మందిని ఆమే చంపేసిందనే ప్రచారం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ టీమ్.. ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. మరి అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏంటి? ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది. ఓ రైతుకు అశ్వినీదేవతలు ఇచ్చిన వరం ఏంటి? ఆ వరాన్ని రాక్షస ఆత్మ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంది. అశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మలు కనుగొన్న తర్వాత ఆర్తి రాజగోపాల్ ఎదురైన సమస్యలు ఏంటి? తనవాళ్లను కాపాడుకోవడానికి అర్జున్ చేసిన సాహసం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్విన్స్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు అనే రెండు పర్శ్వాలుంటాయి. బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. ఎంతో నిగ్రహంతో మన మనసుని మార్చుకొని బుద్దితో మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది. మంచి.. చెడు ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంటుందనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు తరుణ్ తేజ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని ఐదు చాప్టర్లు( Two deaths,Two voices, Two curses, The mind of two worlds, The world of two minds) చూపించారు. రైతు ఇద్దరు కుమారు చనిపోవడం.. అశ్వినీదేవతలు ప్రత్యేక్షమై వరం ఇవ్వడం.. రాక్షస ఆత్మ ఆశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మల్లో ఒకదానిని దొంగిలించి.. భూమి మీదకు రావడం..ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా రొటీన్ హారర్ చిత్రాల్లాగే సాగుతుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ విచిత్రమైన సౌండ్లతో ఆడియన్స్‌ని భయపెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్)నేపథ్యంతో అసలు సినిమా స్వభావం ఏంతో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను భయపెట్టడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు కథను వెల్లడించి థ్రిల్లింగ్‌కు గురి చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తంగా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఓ మంచి సందేశాన్ని అందించారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రలో వసంత్ రవి ఒదిగిపోయాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన రవి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఇక రవి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విమలా రామన్‌ది. ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్‌గా ఆమె చక్కగా నటించి మెప్పించింది.మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ సిద్ధార్థ్ అందించిన నేపథ్య సంగీతం. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని భయపెట్టాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం సౌండ్స్‌తోనే థ్రిల్లింగ్‌కి గురి చేశాడు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
టెక్నాలజీ మాయ
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి. వెంకటేష్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఇందులో భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కథ సాగుతుంది. నేటి యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు సినిమాలో ఉంటాయి. హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌గార్లు విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
వాస్తవ ప్రేమకథ!
ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఓ వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడు. యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆండ్రియా, అంజలి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు వెంకటేశ్. -
నేటి ట్రెండ్‌కు తగ్గ సినిమా
అంజలి, ఆండ్రియా, వసంత్, రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగులోకి అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది. యువన్ శంకర్ ఆడియో బాగుంది. మా గుడ్ సినిమా గ్రూప్‌లో విడుదల కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. బాగా నచ్చింది. తెలుగులో అనువదించి, విడుదల చేద్దామని జ్ఞానవేల్ రాజాను సంప్రదించాను. అప్పటికే డి. వెంకటేశ్ హక్కులు దక్కించుకున్నారని తెలిసింది’’ అన్నారు యస్కేయన్. ‘‘తెలుగులో కూడా ‘తారామణి’ ఆడియో పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా కూడా అక్కడిలానే విజయం సాధిస్తుందనుకుంటు న్నాను’’ అన్నారు డి. వెంకటేశ్. శ్రీకాంత్, శ్రేయాస్ శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఈరోజుల్లో’ స్టైల్లో ఉంది – మారుతి
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ముఖ్య తారలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లో డి.వెంకటేశ్ తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ ఏరియా పేరే ‘తారామణి’. ఈ సినిమాని ఇటీవల చూశాను. ‘ఈరోజుల్లో’ సినిమా స్టైల్లో ట్రెండ్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంది. సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్ క్రాస్ చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్‌గారు కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తమిళంలో పెద్ద సక్సెస్ సాధించిన చిత్రమిది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్టైన్మెంట్గా చూపించడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా ఇది. తప్పకుండా తెలుగులోనూ సక్సెస్ అవుతుంది’’ అన్నారు డి.వెంకటే‹శ్. నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, మల్టీడైమన్షన్ వాసు, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. -
టెక్నాలజీ మాయలో...
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ముఖ్యతారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తారామణి’ను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేష్. ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? దానివల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు కూడా ఉంటాయి. తమిళంలో ఈ సినిమా ట్రైలర్‌ను హీరో కమల్‌హాసన్, పాటలను రజనీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.