టెక్నాలజీ మాయలో... | 'Taramani' is the film's release in this month | Sakshi
Sakshi News home page

టెక్నాలజీ మాయలో...

Published Sat, Aug 5 2017 2:42 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

టెక్నాలజీ మాయలో...

టెక్నాలజీ మాయలో...

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ముఖ్యతారలుగా రామ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తారామణి’ను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేష్‌. ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

టెక్నాలజీ మాయలో పడి యువత ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? దానివల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు కూడా ఉంటాయి. తమిళంలో ఈ సినిమా ట్రైలర్‌ను హీరో కమల్‌హాసన్, పాటలను రజనీకాంత్‌ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement