Taramani
-
తారామణి చూశా... చాలా బాగుంది – మారుతి
నెలకు ఎనభై వేలు సంపాదించే సాఫ్ట్వేర్ అమ్మాయి పనీపాటా లేని అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ప్రేయసిని ఆ ప్రేమికుడు అడిగే ప్రశ్నలు, సందేహాలు విచిత్రంగా ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి, ఈ నిరుద్యోగి కుర్రాడి లవ్‌స్టోరీలో మలుపులు ఏంటి? ఆ కుర్రాడికి ఉద్యోగం దొరుకుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘తారామణి’. తెలుగమ్మాయి అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధానపాత్రల్లో రామ్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి. వెంకటేశ్ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహానుభావుడు’ రీ రికార్డింగ్ సమయంలో ‘తారామణి’ చూశా. మంచి సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్‌ను బేస్ చేసుకుని స్ట్రాంగ్ కంటెంట్‌తో రామ్ ఈ సినిమా అద్భుతంగా రూపొందించాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ప్రతి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడానికి ఎవడో ఒకడు వస్తుంటాడు. అలాంటి వ్యక్తి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సినిమా అవగాహన కల్పిస్తుంది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డి. వెంకటేశ్. నిర్మాతలు బి.ఎ. రాజు, సురేశ్ కొండేటి, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీ మాయలో...
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ముఖ్యతారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తారామణి’ను అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత డి. వెంకటేష్. ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? దానివల్ల ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు కూడా ఉంటాయి. తమిళంలో ఈ సినిమా ట్రైలర్‌ను హీరో కమల్‌హాసన్, పాటలను రజనీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
సూపర్‌స్టార్ ఆవిష్కరించిన తరమణి గీతాలు
తరమణి చిత్ర గీతాలను సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం ఆవిష్కరించారు. తంగమీన్ గళ్ తదితర వైవిద్య భరిత చిత్రాల దర్శకుడు రామ్ తాజా సృష్టి తరమణి. నవ నటుడు వసంత్‌రవి, ఆండ్రియా, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జేఎస్కే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జే.సతీశ్‌కుమార్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని గీతాలను ఇటీవలే కన్నుమూసిన గీతరచయిత నా.ముత్తుకుమార్ రాశారు. దీంతో ఈ చిత్ర గీతాలను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు దర్శకుడు రామ్, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా తెలిపారు. ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ కాన్సెప్‌్టతో ఒక వీడియోను చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపరిచినట్లు, దానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు దర్శకుడు రామ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ తరమణి చిత్ర గీతాలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదే సమయంలో గీత రచయిత నా.ముత్తుకుమార్‌ను తలచుకుంటే మనసు బాధతో ద్రవిస్తోందని అన్నారు. 1,500కు పైగా పాటలను రాసిన ప్రముఖ గీత రచయిత ఆయనని అన్నారు. తరమణి చిత్ర గీతాలను ఆయనకు అంకితం ఇచ్చినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మాట్లాడుతూ తన సంగీత కెరీర్లో నా.ముత్తుకుమార్ రాసిన పలు పాటలు మైలురాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆ చిత్రంలోని పాటలు సినీ శ్రోతల మనసులను హత్తుకుంటాయని అన్నారు. -
డిసెంబర్లో తరమణి
చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం తరమణి. తంగమీన్‌గళ్ చిత్రం ఫేమ్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసంత్వ్రి, ఆండ్రిమా జంటగా నటిస్తున్నారు. పలు ఉత్తమ కథా చిత్రాలను రూపొందించిన జేఎస్కే ఫిలిం కార్పొరేషన్ అధినేత సతీష్‌కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి నిర్మాత సతీష్‌కుమార్ తెలుపుతూ ఐటీ రంగానికి స్వర్గ ద్వారంగా మారిన తరమణి మరో కోణాన్ని ఆవిష్కరించే కథా చిత్రం తరమణి అన్నారు. మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించే తమ సంస్థలో తరమణి మరింత ఉన్నత చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్ చాలా దృఢమైన నమ్మకంతో తొలిసారిగా తెరకెక్కించిన ఎంటర్టెయిన్మెంట్తో కూడిన వైవిధ్య కథా చిత్రం తరమణి అని పేర్కొన్నారు. దీనికి మంచి సాంకేతిక వర్గం తోడైందన్నారు. ముఖ్యంగా యువన్ శంకర్‌రాజా సంగీతం చిత్రానికి పక్కాబలంగా ఉంటుందని తెలిపారు. తన బ్యానర్లో ఒక ప్రత్కేక చిత్రంగా నిలిచే తరమణి చిత్ర ఆడియోను నవంబర్ 20వ తేదీన చిత్రాన్ని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత సతీష్‌కుమార్ వెల్లడించారు. -
డిఫరెంట్ లవ్‌స్టోరీ
తమిళంలో మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న చిత్రం ‘తంగ మీన్గళ్’. ఆ చిత్ర దర్శకుడు రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘తారామణి’. ఓ ఆంగ్లో-ఇండియన్ అమ్మాయికీ, పల్లెటూరి అబ్బాయికీ మధ్య సాగే వినూత్న ప్రేమకథ ఇది. ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు హక్కులను డీవీ సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేశ్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ పలు విభిన్నమైన చిత్రాలను అందించి, సక్సెస్ సాధించాం. మరో వైవిధ్యమైన చిత్రాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో తెలుగు టైటిల్ ప్రకటిస్తాం. జీవా, కాజల్ అగర్వాల్ నటించిన తమిళ చిత్రాన్ని ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ‘తారామణి’, ‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్రాలను ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
ముచ్చటగా మూడోసారి!
పదహారణాల తెలుగమ్మాయి అంజలి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. సో.. కథానాయికగా ఫుల్ బిజీ. అయినప్పటికీ ‘తరమణి’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ పాత్ర తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా ఉంటుందట. అందుకే, అంజలి ఈ పాత్ర అంగీకరించారట. కాగా, తమిళంలో కో, సింగమ్ 2 చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు అంజలి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేయనున్నారు.