సూపర్‌స్టార్‌ ఆవిష్కరించిన తరమణి గీతాలు | Superstar invention taramani songs | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌ ఆవిష్కరించిన తరమణి గీతాలు

Published Sat, Dec 31 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

సూపర్‌స్టార్‌ ఆవిష్కరించిన తరమణి గీతాలు

సూపర్‌స్టార్‌ ఆవిష్కరించిన తరమణి గీతాలు

తరమణి చిత్ర గీతాలను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం ఆవిష్కరించారు. తంగమీన్ గళ్‌ తదితర వైవిద్య భరిత చిత్రాల దర్శకుడు రామ్‌ తాజా సృష్టి తరమణి. నవ నటుడు వసంత్‌రవి, ఆండ్రియా, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జేఎస్‌కే ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జే.సతీశ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని గీతాలను ఇటీవలే కన్నుమూసిన గీతరచయిత నా.ముత్తుకుమార్‌ రాశారు. దీంతో ఈ చిత్ర గీతాలను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు దర్శకుడు రామ్, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా తెలిపారు. ఫ్రమ్‌ ది బాటమ్‌ ఆఫ్‌ అవర్‌ హార్ట్‌ కాన్సెప్‌్టతో ఒక వీడియోను చిత్రీకరించి యూట్యూబ్‌లో పొందుపరిచినట్లు, దానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు దర్శకుడు రామ్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రజనీకాంత్‌ తరమణి చిత్ర గీతాలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

అదే సమయంలో గీత రచయిత నా.ముత్తుకుమార్‌ను తలచుకుంటే మనసు బాధతో ద్రవిస్తోందని అన్నారు. 1,500కు పైగా పాటలను రాసిన ప్రముఖ గీత రచయిత ఆయనని అన్నారు. తరమణి చిత్ర గీతాలను ఆయనకు అంకితం ఇచ్చినట్లు తెలిపారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా మాట్లాడుతూ తన సంగీత కెరీర్‌లో నా.ముత్తుకుమార్‌ రాసిన పలు పాటలు మైలురాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆ చిత్రంలోని పాటలు సినీ శ్రోతల మనసులను హత్తుకుంటాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement