డిసెంబర్‌లో తరమణి
చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం తరమణి. తంగమీన్‌గళ్ చిత్రం ఫేమ్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసంత్వ్రి, ఆండ్రిమా జంటగా నటిస్తున్నారు. పలు ఉత్తమ కథా చిత్రాలను రూపొందించిన జేఎస్‌కే ఫిలిం కార్పొరేషన్ అధినేత సతీష్‌కుమార్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి నిర్మాత సతీష్‌కుమార్ తెలుపుతూ ఐటీ రంగానికి స్వర్గ ద్వారంగా మారిన తరమణి మరో కోణాన్ని ఆవిష్కరించే కథా చిత్రం తరమణి అన్నారు.
మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించే తమ సంస్థలో తరమణి మరింత ఉన్నత చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్ చాలా దృఢమైన నమ్మకంతో తొలిసారిగా తెరకెక్కించిన ఎంటర్‌టెయిన్‌మెంట్‌తో కూడిన వైవిధ్య కథా చిత్రం తరమణి అని పేర్కొన్నారు. దీనికి మంచి సాంకేతిక వర్గం తోడైందన్నారు. ముఖ్యంగా యువన్ శంకర్‌రాజా సంగీతం చిత్రానికి పక్కాబలంగా ఉంటుందని తెలిపారు. తన బ్యానర్‌లో ఒక ప్రత్కేక చిత్రంగా నిలిచే తరమణి చిత్ర ఆడియోను నవంబర్ 20వ తేదీన చిత్రాన్ని డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత సతీష్‌కుమార్ వెల్లడించారు.