వాస్తవ ప్రేమకథ! | tharamani released on september 21 | Sakshi
Sakshi News home page

వాస్తవ ప్రేమకథ!

Published Sat, Aug 25 2018 3:13 AM | Last Updated on Sat, Aug 25 2018 3:13 AM

tharamani released on september 21 - Sakshi

అంజలి

ఆండ్రియా, అంజలి, వసంత్‌ రవి ముఖ్య తారలుగా రామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్‌ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీవీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై డి. వెంకటేశ్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఓ వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద  ప్లస్‌ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళంలో హిట్‌ సాధించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆండ్రియా, అంజలి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు వెంకటేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement