tharamani
-
నా మనసుకు నచ్చిన చిత్రమిది
జె.ఎస్.కె ఫిలింస్ కార్పొరేషన్ సమర్పణలో అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకుడు. డి.వి.వెంకటేశ్, ఉదయ్ హర్ష వడ్డేల్ల ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్, ఉదయ్ ఎంతో అభిరుచి ఉన్న నిర్మాతలు. ట్రైలర్ చూశాక ఇది రియలిస్టిక్ ఫిల్మ్ అని అర్థమైంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్‌ని ఇప్పటి సినిమాలు చెబుతున్నాయి. ఇది అలాంటి సినిమానే’’ అన్నారు. డీవీ వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో పెద్ద హిటై్టన చిత్రమిది. తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదర్లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎక్కడా రాజీపడకుండా అనువాదం చేశాం’’ అన్నారు. మరో నిర్మాత ఉదయ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? అనేది ప్రధానాంశం’’ అన్నారు. హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం తమిళ్లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. నా మనసుకు నచ్చిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగులో ఈ సినిమా విడుదల అవటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీ మాయ
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి. వెంకటేష్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఇందులో భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కథ సాగుతుంది. నేటి యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు సినిమాలో ఉంటాయి. హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌గార్లు విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
దేనికైనా టైమ్ రావాలి
బ్యాడ్ టైమ్‌లో బాధపడి లాభం లేదు. ఓపిక పట్టాలి. దేనికైనా టైమ్ రావాలి అంటున్నారు కథానాయిక ఆండ్రియా జెర్మియా. ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలా సడన్‌గా ఫిలసాఫికల్ టర్న్ ఎందుకు తీసుకున్నారు? అని ఆండ్రియాని అడిగితే... ‘‘బేసిగ్గా నాకు కాస్త ఓపిక తక్కువ. అన్నీ వెంట వెంటనే జరిగిపోవాలని ఆరాట పడతాను. ‘‘తారామణి’ సినిమాకు మంచి అప్రిషియేషన్ దక్కిన తర్వాత నాకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించుకున్నాను. కానీ అలా జరగలేదు. కాస్త దిగులు పడ్డాను. ‘ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని బాధపడకు. అందరూ ఇప్పుడే నీ కోసం పాత్రలు రాస్తూ ఉండొచ్చు. రానున్న రోజుల్లో పుల్ బిజీగా ఉంటావ్’ అని దాదాపు ఎనిమిది నెలల క్రితం దర్శకుడు వెట్రిమారన్ ధైర్యం చెప్పారు. ఎగ్జాట్లీ ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది. మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అప్పుడు అర్థం అయ్యింది.. దేనికైనా టైమ్ రావాలని. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడటం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఓర్పుతో నేర్పుగా ముందడుగు వేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
వాస్తవ ప్రేమకథ!
ఆండ్రియా, అంజలి, వసంత్ రవి ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వచ్చే నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఓ వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడు. యువన్ శంకర్‌రాజా సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. ఆండ్రియా, అంజలి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు వెంకటేశ్. -
నేటి ట్రెండ్‌కు తగ్గ సినిమా
అంజలి, ఆండ్రియా, వసంత్, రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. తమిళంలో హిట్ సాధించిన ఈ సినిమాను అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ తెలుగులోకి అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది. యువన్ శంకర్ ఆడియో బాగుంది. మా గుడ్ సినిమా గ్రూప్‌లో విడుదల కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమా చూశాను. బాగా నచ్చింది. తెలుగులో అనువదించి, విడుదల చేద్దామని జ్ఞానవేల్ రాజాను సంప్రదించాను. అప్పటికే డి. వెంకటేశ్ హక్కులు దక్కించుకున్నారని తెలిసింది’’ అన్నారు యస్కేయన్. ‘‘తెలుగులో కూడా ‘తారామణి’ ఆడియో పెద్ద హిట్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా కూడా అక్కడిలానే విజయం సాధిస్తుందనుకుంటు న్నాను’’ అన్నారు డి. వెంకటేశ్. శ్రీకాంత్, శ్రేయాస్ శ్రీనివాస్, రాజేశ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఈరోజుల్లో’ స్టైల్లో ఉంది – మారుతి
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ముఖ్య తారలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లో డి.వెంకటేశ్ తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ ఏరియా పేరే ‘తారామణి’. ఈ సినిమాని ఇటీవల చూశాను. ‘ఈరోజుల్లో’ సినిమా స్టైల్లో ట్రెండ్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంది. సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్ క్రాస్ చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్‌గారు కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తమిళంలో పెద్ద సక్సెస్ సాధించిన చిత్రమిది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్టైన్మెంట్గా చూపించడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా ఇది. తప్పకుండా తెలుగులోనూ సక్సెస్ అవుతుంది’’ అన్నారు డి.వెంకటే‹శ్. నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, మల్టీడైమన్షన్ వాసు, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. -
టాప్ హీరోలతో నటిస్తేనే అది సాధ్యమా?
తమిళసినిమా: సినీరంగంలో పురుషాధిక్యమే రాజ్యమేలుతోందన్నది వాస్తవం. స్టార్ హీరోల కనుసన్నల్లోనే సినిమా రూపొందుతోంది. నయనతార లాంటి నటీమణులే హీరోలకు ధీటుగా హీరోయిన్ పాధాన్యత చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఎలాంటి పాత్ర అయినా నటనకు అవకాశం ఉంటే నటించేందుకు వెనుకాడని నటి ఆండ్రియా పేర్కొన్నారు. ఇటీవల తరమణి చిత్రంలో ఎవరూ నటించడానికి సాహసించని పాత్రలో నటించి మెప్పించారు.అయినప్పటికీ ఈ ఉత్తరాది బ్యూటీ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. ఈ విషయంపై సినీ వర్గాలకు ఇటీవల ఘాటుగానే చురకలంటించారు. ఆండ్రియా ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ నటుడు విజయ్‌కి జంటగా ఒక చిత్రంలో నటిస్తూ ఏమీ చేయకుండానే మూడు పాటల్లో ఆయనతో ఆడితే ఆ చిత్రం విడుదలై విజయం సాధిస్తే ఆ నటికి వరుసగా నాలుగైదు చిత్రాల అవకాశాలు వరించేస్తున్నాయి అని అన్నారు. అయితే తరమణి లాంటి చిత్రంలో ఉత్తమ నటనను ప్రదర్శించిన తనకు ప్రశంసలు అభించాయే గానీ ఆ తరువాత కొత్తగా ఒక్క అవకాశం రాలేదని అన్నారు. అయితే నటి నయనతార కూడా ఆదిలోనే రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ హీరోల జంటగా నటించిన తరువాతే ఆమెకు స్టార్ హీరోయిన్ అంతస్తు లభించిందని అన్నారు. అలా జరగకుంటే నయనతార గురించి ఇంతగా బయట ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. తానేమంటానంటే ఒక నటి ప్రతిభను ఆమె ఎవరితో నటించారన్నదాన్ని బట్టి నిర్ణయించరాదన్నారు. -
నీకై ఎదురు చూస్తుంటాలే!
అంజలి, ఆండ్రియా, వసంత్ ముఖ్య తారలుగా రామ్ దర్శకత్వంలో రూపొంది, తమిళ్లో విజయవంతమైన చిత్రం ‘తారామణి’. జె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో డీవీ సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేశ్ అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చేతులు చాచి.. యుగములు వేచి, నీకై ఎదురు చూస్తుంటాలే..’ అనే పాటను సంగీతదర్శకురాలు, గాయని ఎం.ఎం. శ్రీలేఖ విడుదల చేశారు. శ్రీలేఖ మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ రామ్ చాలా బాగా తీశారు. వెంకటేశ్‌గారు స్ట్రైట్ మూవీస్ తీసి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘లేడీ ఆడియన్స్‌కు బాగా రీచ్ అవుతుందనే శ్రీలేఖగారితో ఈ పాటను రిలీజ్ చేయించాం. తమిళ్లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ సినిమా తెలుగులో అంతకంటే పెద్ద హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు డి. వెంకటేశ్. -
తారామణి...
ఆండ్రియా, అంజలి, వసంతకుమార్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘తారామణి’. తమిళంలో చిన్న సినిమాగా రిలీజై, పెద్ద విజయం సాధించిన సినిమా. రామ్ దర్శకత్వం వహించారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి.వెంకటేశ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా బోల్డ్ క్యారెక్టర్లో నటించింది ఆండ్రియా. యువత మెచ్చే కథాంశంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వెంకటేశ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా. -
ప్రతినాయకి పాత్రల్లో రాణించాలి
తమిళసినిమా: ప్రతినాయకి పాత్రల్లో రాణించాలన్నది తన కోరిక అని అంటున్నారు నటి లిజీ ఆంటోనీ. ఆమె ఎవరు, నటిగా సత్తా ఏమిటన్నది తరమణి చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇందులో పోలీసు అధికారిగా నటించిన చిత్ర నిర్మాత జే.సతీష్‌కుమార్‌కు భార్యగా నటించిన నటి లిజీ ఆంథోని. ఆమె తన గురించి ఇలా చెప్పుకొచ్చింది. మా పూర్వీకం కేరళకు చెందినదైనా నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. అదీ ఉత్తర చెన్నైలోని వణ్ణైయార్‌పేట. ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో చదివి, స్టె ల్లామేరిస్ కళాశాలలో బీకామ్, మద్రాసు వర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాను. అనంతరం స్త్రీలది షాపింగ్ ప్రపంచం అని భావించి ఆ రంగంలోకి ప్రవేశించి దేశ విదేశాలు తిరిగి అందులో రాణించాను. అలా నా జీవితం పూర్తిగా మారిపోయింది. నాకు నాట్యం అంటే చాలా ఇష్టం. అందుకే సంప్రదాయబద్ధంగా క్లాసిక్ నృత్యాన్ని నేర్చుకున్నాను. ఆ మధ్య ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు రామ్‌తో స్నేహం ఏర్పడింది. ఆయన తంగమీన్‌గళ్ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించమని అడగడంతో నటించాను. అందులో స్టెల్లా మిస్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తరువాత 15 చిత్రాల వరకూ నటించాను. రామ్ మళ్లీ తరమణి చిత్రంలో అవకాశం కల్పిం చారు. ఆయన చిత్రాలలో పాత్రలు ఎలా ఉం టాయో నాకు బాగా తెలుసు. అందుకే పాత్ర గురించి కూడా అడగకుండా నటించడానికి ఓకే చెప్పాను. ఇందులో పోలీసు అధికారి భార్యగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించాను. ఇందులోని నటనకు గానూ చాలా మంది ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రశంలందాయి. నాకు నటనలో స్ఫూర్తి అంటూ ఎవరూ లేరు. అలా మరొకరిని అనుకరించాలని అనుకోను. ప్రతినాయకి పాత్రల్లో రాణించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం రామ్ దర్శకత్వంలో పేరంబు చిత్రంతో పాటు, ఛూ మంత్రకాళి, ఇలా మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది లిజీ ఆంథోని. -
నాకు నచ్చితే ఏదైనా చేస్తా!
తమిళసినిమా: నటి ఆండ్రియా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షీ ఈజ్ వెరీ బోల్డ్ యాక్ట్రస్. సంచలన నటి కూడా. చాలా సెలక్టివ్ పాత్రల్లోనే కనిపించే ఆండ్రియా నటించిన తాజా చిత్రం తరమణి. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో ఆడ్రియా నటనకు ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా ఐటీ కంపెనీలో పనిచేసే యువతిగా నటించింది. అంతే కాదు ఒక పిల్లాడికి తల్లిగానూ నటించింది. అసలు విషయం ఇవేవీ కాదు. తరమణి చిత్రంలో మద్యం తాగడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాల్లో నటించడమే విమర్శలకు దారి తీస్తోంది. అయితే అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనంటోంది ఆండ్రియా. అదే విధంగా ఇమేజ్ గురించి కూడా ఆలోచించనని అంటోంది. దీని గురించి ఆండ్రియా స్పందిస్తూ, తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంది. దర్శకుడు రామ్ తరమణి చిత్ర కథ«ను చెప్పి ఇందులో మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి అని చెప్పారని, కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే అన్నానని తెలిపింది. ప్రస్తుతం వడచెన్నై, తుప్పరివాలన్ చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలు వైవిధ్యంగా నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా వడచెన్నై చిత్రంలో తనను చూసిన వారు ఈమె ఆండ్రియానేనా అని ఆశ్చర్య పోతారని అంది. ఇకపై కూడా విభిన్న కథా పాత్రలనే పోషించాలని నిర్ణయించుకున్నానని, అలాంటప్పుడు ఇమేజ్ గురించి పట్టించుకోనని, ఎవరెలా విమర్శించుకున్నా బాధలేదని అంటోంది. -
రజనీ మెచ్చిన తరమణి
తమిళసినిమా: తరమణి చిత్రం గురించి ఇప్పటికే చాలా విషయాలు చెప్పుకున్నాం. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు రామ్‌నే. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం తరమణి. జేఎస్కే ఫిలింస్ పతాకంపై జే.సతీష్‌కుమార్ నిర్మించిన ఇందులో నవ నటుడు రవి, ఆండ్రియా జంటగా నటించారు. నిర్మాత జే.సతీష్‌కుమార్ కూడా తొలిసారిగా ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించడం విశేషం. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను చూరగొంటోంది. దీంతో చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జే.సతీష్‌కుమార్ మాట్లాడుతూ తరమణి చిత్రం విజయం సాధించడం ఒక సంతోషం అయితే, చిత్రం చూసిన నటుడు రజనీకాంత్ అభినందించడం ఇంకా ఆనందంగా ఉందని అన్నారు. సోమవారం తరమణి చిత్రాన్ని చూసిన రజనీకాంత్ తనకు ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించారన్నారు. తాను కొంచెం ఆశ్చర్యంతోనే రజనీకాంత్‌ను కలవడానికి వెళ్లానని చెప్పారు.అయితే ఆయన తరమణి చిత్రంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించి చాలా బోల్డ్ చిత్రం అని అభినంధించారని అన్నారు. అంతే కాకుండా తన నటనను ప్రశంసించడం ఎనలేని ఆనందాన్ని కలిగించిందన్నారు. రజనీకాంత్ లాంటి లెజెండ్స్ ప్రశంసలు తనకు, తన సంస్థకు తరమణి లాంటి మంచి చిత్రాలు మరిన్ని నిర్మించడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయని జే.సతీష్‌కుమార్ అన్నారు. తరమణి చిత్రం విడుదల తరువాత మరిన్ని స్క్రీన్లు పెరిగాయని ఆయన తెలిపారు.