తారామణి... | Doctors in Tharamani, Chennai | Sakshi
Sakshi News home page

తారామణి...

Published Fri, Jan 5 2018 1:13 AM | Last Updated on Fri, Jan 5 2018 1:13 AM

Doctors in Tharamani, Chennai  - Sakshi

ఆండ్రియా, అంజలి, వసంతకుమార్‌ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘తారామణి’. తమిళంలో  చిన్న సినిమాగా రిలీజై, పెద్ద విజయం సాధించిన సినిమా. రామ్‌  దర్శకత్వం వహించారు. డి.వి. సినీ క్రియేషన్స్‌ పతాకంపై యశ్వంత్‌ మూవీస్‌ సమర్పణలో డి.వెంకటేశ్‌  ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా బోల్డ్‌ క్యారెక్టర్‌లో నటించింది ఆండ్రియా. యువత మెచ్చే కథాంశంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వెంకటేశ్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement