vasanth kumar
-
భారత క్రికెట్ జట్టు (దివ్యాంగుల) కెప్టెన్‌గా వసంతకుమార్
హిందూపురం టౌన్: టీమిండియా దివ్యాంగుల క్రికెట్ టీ-20 జట్టు కెప్టెన్‌గా హిందూపురానికి చెందిన వై.వసంతకుమార్ ఎంపికయ్యాడు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సమావేశంలో సెప్టెంబర్‌లో దేశంలోని వివిధ స్టేడియాల్లో జరగనున్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ టోరీ్నలకు సంబంధించి జట్లను ప్రకటించారు. మూడు ఫార్మెట్లలోనూ వసంత కుమార్‌కు ప్రాతిని«ధ్యం దక్కింది. అలాగే టీ-20 జట్టు కెపె్టన్‌గా ఎంపికయ్యాడు. -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఇటీవల గవర్నర్ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అగస్తీశ్వరంలో అంత్యక్రియలు కాగా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్‌కుమార్ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ఇక పదవీకాలం ముగియకుండా మరణించిన ప్రజాప్రతినిధుల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడం సహజం. అయితే వసంతకుమార్ ప్రాతినిధ్యం వహించిన కన్యాకుమారీ లోక్‌సభ నియోజకవర్గంలో అర్థ శతాబ్ధం విరామం తర్వాత ఉప ఎన్నికల పరిస్థితి చోటుచేసుకోవడం గమనార్హం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంత్‌కుమార్ గెలుపొందగా, ఆయన పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉంది. -
30 సెకన్లలోనే అన్ని వివరాలు
సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంతకల్లు, నెల్లూరు డివిజన్ పరిధిలో కొత్త మొబైల్ యాప్స్‌ను రూపొందించినట్లు నెల్లూరు డీఎస్పీ వసంత్ కుమార్ గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 8.4 లక్షల నేరగాళ్ల డేటాను ఆన్లైన్లో పొందిపరిచినట్లు తెలిపారు. మొబైల్ గుర్తింపు పరికరంలో నేరగాళ్లు ఏ వేలిముద్ర వేసిన వాళ్ల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇంతకముందు ఎడమచేతి బొటన వేలి ముద్రలను తీసుకునే వారని తెలిపారు.వేలిముద్ర వేయగానే 23 నుంచి 30 సెకన్లలో అన్ని వివరాలు నమోదవుతాయని వెల్లడించారు. దీని ద్వారా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని, నేరాగాళ్ల కదలికలను గుర్తించడంలో తేలికవుతుందన్నారు. అలాగే 15 పోలీస్ స్టేషన్లకు అధికారులు 30 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌లను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా రైళ్లలో రోజుకు 60 నుంచి 70 బీట్లు ఉంటాయని, బీట్‌ళో ఉన్న సిబ్బంది ట్యాబ్, సెల్ ద్వారా మెసేజ్, వీడియోను ఈ యాప్ ద్వారా పంపవచ్చన్నారు. వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
గుట్టుగా రికార్డుల తరలింపు
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్న్‌షిప్ (హౌస్‌సర్జన్) సర్టిఫికెట్ల జారీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా హౌస్సర్జన్లకు సంబంధించిన లాగ్‌బుక్‌లను తారుమారు చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా సృష్టించింది. అయితే ఆస్పత్రి అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం మరో ఎత్తు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సహా ఓపీ, ఐపీ ఇలా ఒక్కో విభాగంలో ఒక్కో నెల చొప్పున అన్ని విభాగాల్లోనూ పని చేయాల్సి ఉంది. కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులే కాకుండా దేశ, విదేశాల్లోని వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు సైతం గాంధీ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రుల్లో హౌస్సర్జన్లుగా చేరుతుంటారు. ఆయా ఆస్పత్రుల్లో ఏటా 500 మందికిపైగా చేరుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో పలువురు విధులకు గైర్హాజరవుతున్నారు. గత నాలుగేళ్లలో సుమారు 350 మంది ఇలా గైర్హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో చాలా మంది హౌస్‌సర్జన్‌గా పని చేయకుండానే సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు ఆయా విభాగాల అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టోర్‌రూమ్ నుంచి ఫైళ్లు తెప్పించి... ఆస్పత్రి వైద్యుల మధ్య అంతర్గత విబేధాలు తారా స్థాయికి చేరుకోవడం, ఇటీవల ఒకరిపై మరొకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కరోనా బాధితుల వివరాలను బహిర్గతం చేశారనే సాకుతో సీఎంఓ డాక్టర్ వసంత్‌కుమార్‌పై ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఐదురోజుల క్రితం క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం, అతడిని డీహెచ్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం ఉదయం ఆస్పత్రి ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం, శానిటేషన్, హౌస్‌సర్జన్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇందులో సూపరింటిండెంట్ సహా ఆర్ఎంఓ, మరో క్లర్కు పాత్ర ఉందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌గా పని చేసేందుకు చేరిన విద్యార్థుల పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆగమేఘాలపై ఆయా ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన హాజరు పట్టిక సహా లాగ్‌బుక్, ఇతర ఫైళ్లను స్టోర్‌రూమ్ నుంచి తెప్పించి, గుట్టుచప్పుడు కాకుండా ఓ గదిలోకి తరలించారు. రికార్డుల్లోని కొన్ని కాలమ్స్‌ను కొట్టివేసి, కొత్తగా మరికొన్ని వివరాలు నమోదు చేస్తూ మీడియాకు దొరికిపోవడం సంచలనంగా మారింది. అయితే ఈ అంశాన్ని ఆస్పత్రి పాలనా యంత్రంగా కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐరీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలులో ఉందని, హౌస్సర్జన్లకు సంబంధించి రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు అవాస్తవం: సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రభుత్వం కోరిన అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రతి ఘటనపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తన ఛాంబర్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఆస్పత్రిలో 250 మంది ట్రాన్స్ఫర్ ఇంటర్నీస్, హౌస్సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారని, 2019 మార్చి నుంచి వారికి బయోమెట్రిక్, ఐరిస్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నామన్నారు. ఇంటర్నీస్, హౌస్సర్జన్ల నుంచి డబ్బులు తీసుకుని హాజరు వేసే విధానం గతంలో ఉండేదేమో కానీ, ప్రస్తుతం లేదన్నారు. విధులకు గైర్హాజరైన 60 మంది ఇంటర్నీస్, హౌస్‌సర్జన్లను ఎక్స్టెన్షన్ చేసినట్లు తెలిపారు. హౌస్సర్జన్లు, ఇంటర్నీస్ లాగ్ బుక్‌లు, బయోమెట్రిక్ హాజరు పట్టికలకు సంబంధించిన రికార్డులను డీఎంఈ రమేష్‌రెడ్డికి అందజేసేందుకు వరుస క్రమంలో సర్దుతుండగా వీడియోలు తీసి, అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అ సాంఘిక శక్తులు ఆస్పత్రిలో హల్చల్ చేస్తాయనే సమాచారంతోనే ప్రధాన గేటుకు తాళం వేశామే కానీ మీడియాను అడ్డుకోవడానికి కాదని ఆయన వివరించారు. పోలీసులకు ఫిర్యాదు... తనపై దుష్ప్రచారం చేసేందుకు వినియోగించిన తప్పుడు ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను అందించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ వసంత్‌కుమార్ శుక్రవారం చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని చట్టప్రకారం శిక్షించాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించామని న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు చేపడతామని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
డాక్టర్ వసంత్‌కుమార్ ప్రవర్తన వైద్యవృత్తికే కళంకం
గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన టీజీజీడీఏ గాంధీ యూనిట్ కార్యదర్శి డాక్టర్ వసంత్‌కుమార్ ప్రవర్తన వైద్యవృత్తికే కళంకం తెచ్చేవిధంగా ఉందని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ అన్నారు. వసంత్‌కుమార్ చేసిన అవినీతి ఆరోపణలు మతిస్థిమితం కోల్పోయి చేస్తున్నవిగా కొట్టిపారేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవమైన వైద్యవృత్తిలో ఉంటూ వసంత్‌కుమార్ చేసిన ఆత్మహత్యాయత్నం, డబ్బుల కోసం క్యాంటిన్, మెడికల్‌షాపుల యజమానులు, కాంట్రాక్టర్లు...చివరకు కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న చిరుఉద్యోగులపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డాడని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు, వీడియో, ఆడియో క్లిప్పింగులు తమవద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. హౌస్సర్జన్లు విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. 2019 మార్చినెల నుంచి హౌస్సర్జన్లకు బయోమెట్రిక్, ఐరిస్ నమోదుతోపాటు హెచ్ఓడీలు రాజారావు, విమల«థామస్, కృష్ణమోహన్ త్రిసభ్య కమిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఎటువంటి అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేదని, సమర్థవంతమైన పాలనాయంత్రాంగం ఉందన్నారు. వసంత్‌కుమార్ డబ్బులు డిమాండ్ చేశారు డాక్టర్ వసంత్‌కుమార్ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డాడని క్యాంటిన్, మెడికల్ షాపు నిర్వాహకులు, పారిశుధ్యం, సెక్యూరిటీ కాంట్రాక్ట్ ప్రతినిధులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపించారు. వారంతా మీడియాతో మాట్లాడుతూ డబ్బుల కోసం డిమాండ్ చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను మీడియాకు విడుదల చేశారు. హెచ్ఓడీలతో సమావేశం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అన్ని విభాగాల హెచ్ఓడీలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెరుగైన సేవలు, మరింత పారదర్శకమైన పాలన అందించేందుకు తగిన సలహాలు, సూచనలు స్వీకరించారు. వసంత్‌కుమార్ చేసిన ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. -
మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్ వసంత్
-
మానసికంగా బాగానే ఉన్నా: డాక్టర్ వసంత్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వైద్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను మానసికంగా బాగానే ఉన్నానని సస్పెన్షన్‌కు గురైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత్ స్పష్టం చేశారు. తనకు మతి స్థిమితం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎవరి నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. (పెట్రోల్ బాటిళ్లు నడుముకు కట్టుకుని... ) ‘ నా వ్యక్తిగత విషయాలు, బంధువులతో మాట్లాడిన సంభాషణలను బహిర్గతం చేశారు. శ్రవణ్ కుమార్ చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. బయోమెట్రిక్ పద్ధతి లేకుండా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. శానిటేషన్ విషయంలో ప్రతి ఒక్కరూ డీఎంఈకి ఫిర్యాదు చేశారు. నేను ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నిర్ణయాలు తీసుకుంటే నాపై కక్ష కట్టారు. డీఎంఈ రమేశ్ రెడ్డి ఇప్పటికైనా న్యాయం వైపు మాట్లాడాలి’ అని డాక్టర్ వసంత్ కోరారు. కాగా గాంధీ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా గురువారం సాయంత్రం ఆస్పత్రిని పరిశీలించారు. కాగా గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు కోవిడ్–19 (కరోనా వైరస్) బారినా పడినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో సీఎంవో డాక్టర్ వసంత్ సస్పెండ్ అయ్యారు. అయితే తాను చేయని తప్పుకు బలయ్యానని.. తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మంగళవారం నడుము చుట్టూ పెట్రోల్ బాటిళ్లను కట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. -
పెట్రోల్ బాటిళ్లు నడుముకు కట్టుకుని...
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ వసంత్‌కుమార్ మంగళవారం నడుముకు పెట్రోల్ బ్యాటిళ్లు, చేతిలో లైటర్‌తో హల్చల్ చేశారు. సుమారు గంటన్నర పాటు పోలీసులు, వైద్య సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలగూడ పోలీసులకు నగర కొత్వాలు రూ.10,000 నజరానా ప్రకటించారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ వసంత్‌కుమార్ క్యాజువాలిటి మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ)గా విధులు నిర్వహిస్తూ, టీజీజీడీఏ గాంధీ యూనిట్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కరోనా అనుమానితులకు అందించాల్సిన సేవలపై గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో ఈ నెల 7న ఆస్పత్రి పాలనాయంత్రాంగం సమావేశమైంది. అక్కడకు వచ్చిన వసంత్‌కుమార్ పారిశుధ్య నిర్వహణ, నర్సింగ్ సిబ్బంది కొరతపై మాట్లాడుతూ.. ఆర్ఎంఓ జయకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరినా వినిపించుకోకుండా పాలనాయంత్రాంగం పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పాలనాయంత్రాంగం వైద్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వసంత్‌కుమార్‌ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ (డీఎంహెచ్)కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్ బాటిళ్లు కట్టుకుని ఈ క్రమంలో వసంత్‌కుమార్ మంగళవారం మధ్యాహ్నం 12.05 గంటలకు మూడు లీటర్ల పెట్రోల్‌ను బాటిళ్లలో నింపి నడుముకు కట్టుకుని, చేతిలో లైటర్ పట్టుకుని గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం వద్దకు చేరుకున్నారు. తనను అన్యాయంగా సరెండర్ చేశారని, గాంధీ ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారని ఆరోపించారు. పోలీసులు, వైద్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దగ్గరకు వస్తే నిప్పంటించుకుంటానని బెదిరించడంతో దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సుమారు గంటన్నరపాటు హైడ్రామా కొనసాగింది. పరిస్థితి చేయిదాటుతుందని భావించిన పోలీసులు వ్యూహం సిద్ధం చేశారు. వసంత్‌కుమార్‌తో మీడియా ప్రతినిధులు మాట్లాడుతుండగా సీఐ బాలగంగిరెడ్డి ఒక్క ఉదుటన అతన్ని సమీపించి చేతిని వెనకకు విరిచి పట్టుకుని లైటర్‌ను గుంజుకోగా, మిగిలిన సిబ్బంది క్షణాల్లో ఆయన నడుముకున్న బాటిళ్లను తీసేశారు. అనంతరం బేగంపేట ఠాణాకు తరలించారు. ఈ ఘటనను జనరల్ డైరీ (జీడీ)లో పొందుపర్చామని, న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చిలకలగూడ సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి వైద్యుని ప్రాణాలు కాపాడినందుకు నగర కొత్వాల్ అంజనీకుమార్.. చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, పోలీస్ సిబ్బందికి రూ.10 వేల నజరానా ప్రకటించారు. కన్నీటిపర్యంతమైన జ్యోతిర్మయి.... వసంతకుమార్ భార్య జ్యోతిర్మయి గాంధీ గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. నిండు గర్భిణి అయిన ఆమె ఆస్పత్రిలో జరిగిన ఘటనను చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, వసంత్ కుమార్ ఆస్పత్రి ప్రాంగణంలో చేసిన చర్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్ ఖండించారు. వసంత్‌కు అన్యాయం జరిగితే ఉన్నతాధికారులతో సమావేశమై చర్చిస్తామన్నారు. ప్రజారోగ్య విభాగానికి... గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్వహించిన సమీక్షలో ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డాక్టర్ వసంత్‌ను ప్రజారోగ్య సంచాలకుడికి అప్పగించామని వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తూ వసంత్‌కుమార్ ఆస్పత్రిలో ఫార్మసీ కుంభకోణం జరిగిందని డీఎంఈ రమేశ్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రమేశ్‌రెడ్డి స్పందించారు. కొద్దికాలంగా వసంత్ ప్రవర్తన బాగోలేదని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై మాత్రమే వసంత్‌ను సరెండర్ చేశామని స్పష్టం చేశారు. అవకతవకలపై ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదని వసంత్‌ను ప్రశ్నించారు. నడుముకు పెట్రోల్ బాటిళ్లతో వసంత్ కుమార్. (ఇన్సెట్లో) లైటర్ -
కన్యాకుమారి.. వరించేదెవరిని!
బీజేపీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్.. కాంగ్రెస్ ప్రత్యర్థి హెచ్.వసంతకుమార్‌ను 1.28 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. వీరిద్దరే మళ్లీ తలపుడుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరడంతో ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పక్షాలు పోటీలో లేవు. నియోజకవర్గం ఏర్పడ్డాక జరిగిన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి జే హెలెన్ డేవిడ్సన్.. బీజేపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌ను 65 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ బలపడుతోంది. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న కన్యాకుమారి స్థానంలో 15 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. పోలింగ్ గురువారం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజనలో నాగర్‌కోయిల్ స్థానం రద్దయి 2009లో కన్యాకుమారి ఏర్పాటైంది. ప్రస్తుతం ఇక్కడ రెండు జాతీయ పక్షాల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉందనీ, గెలుపుపై జోస్యం చెప్పడం కష్టమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. 1999లో నాగర్‌కోయిల్ నుంచి రాధాకృష్ణన్.. 1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ఎన్నికల్లో పొన్ రాధాకృష్ణన్ నాగర్‌కోయిల్ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సీపీఎం అభ్యర్థి ఏవీ బెలార్మిన్ చేతిలో ఓడిపోయారు. కన్యాకుమారి నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ వర్గం నాడార్ కులానికి చెందిన రాధాకృష్ణన్ జనాదరణ కలిగిన నాయకుడు. నియోజకవర్గంలోని 19 లక్షల జనాభాలో సగం మంది హిందువులు. క్రైస్తవులు 40–45 శాతం వరకు ఉన్నారు. ఎన్నికల్లో మతపరమైన విభజన బీజేపీకి అనుకూలాంశం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న రాధాకృష్ణన్ 2013లో ఈ ప్రాంతంలోని పేద హిందువులందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలంటూ సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ధనికులైన మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇస్తున్నారనీ, హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఈ ఆందోళన ఉధృతంగా సాగింది. మంత్రి అయ్యాక రాధాకృష్ణన్ ఈ విషయంలో చేసిందేమీ లేదనే అసంతృప్తి స్థానికుల్లో ఉంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను కొచ్చి, తూత్తుకుడి వంటి దూర ప్రాంతాలకు పంపే అవసరం లేకుండా వారి కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ హవా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కన్యాకుమారి పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంది. రెండు పార్టీలూ మూడేసి స్థానాలు గెలుచుకున్నాయి. పేదలకు నెలకు రూ.6 వేల సహాయ పథకంతోపాటు తనను గెలిపిస్తే వ్యవసాయ, విద్యా రుణాలు మాఫీ చేయిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వసంత కుమార్ ప్రస్తుత ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు. వసంతకుమార్ కూడా నాడార్ వర్గానికి చెందిన నాయకుడే. నియోజకవర్గంలో టెక్నోపార్క్ ఏర్పాటు చేయిస్తానని ఆయన వాగ్దానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలున్న రిటైల్ సంస్థ వసంత్ అండ్ కంపెనీ స్థాపకుడైన వసంత్‌కుమార్ ఈసారి గెలుపునకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ► సగం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తోంది. రైతులకు మేలు చేసే విధానాలు అమలు చేయకపోవడంతో గిట్టుబాటు ధరలు లేక వారు అల్లాడుతున్నారు. జీడిపప్పు దిగుమతి నిబంధనలు సడలించడంతో ఈ రంగంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ► రహదారుల విస్తరణతో వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోంది. జలవనరులు కుంచించుకుపోతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో చర్చకు వస్తున్నాయి. ► ఎన్డీఏ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కోలాచల్లో ఏర్పాటు చేస్తామన్న కంటెయినర్ టెర్మినల్ ప్రాజెక్టును అధికారంలోకి వచ్చాక సమీపంలోని ఇనాయంకు తరలించారు. తమ జీవనోపాధికి ఈ ప్రాజెక్టు నష్టదాయకమంటూ స్థానిక మత్స్యకారులు ఆందోళన చేశారు. చివరికి ఈ ప్రాజెక్టును కోవలంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కాని, కోలాచల్, ఇనాయం, తెంగైపట్టినం వంటి తీర ప్రాంతాల్లోని క్రైస్తవులైన లక్ష మందికి పైగా మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ► రాధాకృష్ణన్‌కు కన్యాకుమారి, నాగర్‌కోయిల్‌లో చెప్పుకోదగ్గ బలం ఉంది. తీర ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారుల సంఖ్య తక్కువ. తన గెలుపు తీర ప్రాంత ప్రజల తీర్పుపై ఆధారపడి ఉండటంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఈసారి తప్పక పరిష్కరిస్తానని బీజేపీ అభ్యర్థి హామీ చేస్తున్నారు. -
తారామణి...
ఆండ్రియా, అంజలి, వసంతకుమార్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘తారామణి’. తమిళంలో చిన్న సినిమాగా రిలీజై, పెద్ద విజయం సాధించిన సినిమా. రామ్ దర్శకత్వం వహించారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై యశ్వంత్ మూవీస్ సమర్పణలో డి.వెంకటేశ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా బోల్డ్ క్యారెక్టర్లో నటించింది ఆండ్రియా. యువత మెచ్చే కథాంశంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చిత్రం ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత వెంకటేశ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా. -
స్కోరర్ వసంత్ కుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్కోరర్ వసంత్ కుమార్ కులకర్ణి ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. వసంత్ 12 సంవత్సరాలుగా స్కోరర్‌గా పనిచేస్తున్నారు. 46 ఏళ్ల వసంత్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వసంత్ కుమార్ మృతి పట్ల హెచ్‌సీఏ అధికారులు, స్కోరర్లు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
బెదిరింపుల కేసులో సీఐడీ డీఎస్పీ అరెస్ట్
హైదరాబాద్సిటీః తాను ఉంటున్న అపార్ట్మెంట్ మెయింట్‌నెన్స్ ఇవ్వమని అడిగినందుకు అపార్ట్మెంట్ వాసులను వేదించిన కేసులో ఏపీ సీఐడీ డీఎస్పీ వసంతకుమార్‌ను అరెస్ట్ చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చిక్కడపల్లి చందనబ్రదర్స్ ఎదురుగా ఉన్న పూర్ణఆదిత్య రెసిడెన్సీలో నివసించే ఏపి సిఐడి డిఎస్పీ వసంతకుమార్ గత కొంతకాలంగా అపార్ట్మెంట్ మెయింట్‌నెన్స్ డబ్బును చెల్లించడం లేదు. దీంతో అపార్ట్మెంట్ యాజమాన్యం మెయింట్‌నెన్స్ ఇవ్వాలని అడగడంతో వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు వసంత్‌కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతనిపై 362, 462, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుదర్శన్ తెలిపారు. -
డాక్టర్ వేధిస్తున్నాడని నర్సుల ఆందోళన
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వేధిస్తున్నారంటూ నర్సులు, ఏఎన్ఎం లు ఆరోపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే డాక్టర్ వసంతరావు లైంగికంగా వేధిస్తున్నారని వారు సోమవారం విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామంటూ కరీంనగర్ తరలి వెళ్లారు. -
నన్నే తొలగిస్తావా నీకెక్కడిది అధికారం ?
-
నన్నే తొలగిస్తావా?
సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కుతున్నాయి. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యక్షుడు వసంత్ కుమార్ వార్ ప్రకటించారు. నిన్న గాక మొన్నటి వరకు తంగబాలు, చిదంబరం వర్గం ఈవీకేఎస్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ వస్తే, ఇక తామూ ఢీకి రెడీ అని వసంత్‌కుమార్ మద్దతు దారులు ప్రకటించారు. కాంగ్రెస్ అనుబంధ వర్తక సంఘం అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించ డాన్ని వసంత్‌కుమార్ తీవ్రంగా పరిగణించి ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఆ వివాదాలే ఆ పార్టీని రాష్ట్రంలో గడ్డు పరిస్థితుల్లోకి నెట్టాయి. కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుంటామని నేతలు ప్రగల్బాలు పలుకుతూ వస్తున్నా, వివాదాల్ని మాత్రం వీడడం లేదు. ప్రధానంగా అధ్యక్ష పదవి కోసం గ్రూపు నేతల రాజకీయ పైరవీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎట్టకేలకు గ్రూపు నేతలందరూ ఏకం అయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఉద్వాసన పలికించడం లక్ష్యంగా సీనియర్ నేత చిదంబరంతో కలసి అడుగులు వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర జిల్లాల్లో తన కంటూ వ్యక్తిగత పలుకు బడి కల్గి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షించే సంస్థతో వ్యాపార వేత్తగా గుర్తింపు పొంది, తన కంటూ మద్దతు వర్గాన్ని కల్గి ఉన్న వసంతకుమార్ సైతం ప్రస్తుత అధ్యక్షుడు ఈవీకేఎస్‌పై తిరుగు బాటుకు సిద్ధం అయ్యారు. ఢిల్లీ పెద్దల చేత గుర్తించ బడ్డ వసంతకుమార్‌కు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి సైతం దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్ అనుబంధ వర్తక విభాగం అధ్యక్షుడిగా జాతీయ పెద్దల చేత నియమించ బడి 17 సంవత్సరాలు కొనసాగుతూ వస్తున్న వసంత్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం ఈవీకేఎస్ పెద్ద షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో జోడు పదవులు తగదంటూ, వర్తక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో ఎంఎస్ ద్రవ్యంను ఈవీకేఎస్ నియమించారు. తనను తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ ఈవీకేఎస్‌పై వార్ ప్రకటించారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈవీకేఎస్‌పై ఢిల్లీకి ఫిర్యాదులు చేసే పనిలో పడ్డారు. నన్నే తొలగిస్తావా...: తనను వర్తక విభాగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా పరిగణించిన వసంత్‌కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు లేదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోసం తాను, తన ఛానల్, పత్రిక నిరంతరం శ్రమిస్తూ వస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పత్రికగా ఇండియన్, టీవీ ఛానల్‌గా వసంత్‌లు వ్యవహరిస్తున్నాయని, తన సొంత నిధులతో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ వస్తున్న తనపై ఈవీకేఎస్ కుట్రలు పన్ని ఉన్నారని మండి పడ్డారు. పార్టీ నాయకులతో కలసి తాను ఢీల్లికి వె ళ్లడాన్ని పరిగణలోకి తీసుకునే తనను తొలగించి ఉన్నారని మండి పడ్డారు. తనను తొలగించే అధికారం ఈవీకేఎస్‌కు ఎవరిచ్చారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తనను ఆ పదవి నుంచి తొలగించాల్సి వస్తే, అందుకు తగ్గ ఆదేశాలను అధినేత్రి సోనియాగాంధీ జారీ చేయాల్సి ఉందన్నారు. అయితే చట్ట విరుద్ధంగా తనను తొలగించి, ఆయనకు మద్దతుగా ఉన్న మరో వ్యక్తిని కూర్చోబెట్టి ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తన తొలగింపు చట్ట విరుద్ధమని, నేటికీ తానే వర్తక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈవీకేఎస్ చర్యలపై అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశామన్నారు. వసంత్‌కుమార్ వ్యాఖ్యలపై ఈవీకేఎస్ను మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ మౌనం వహించడం గమనార్హం. -
రేణువు కూడా బరువే!
సాక్షి, కాకినాడ : కొత్త సంవత్సరంలో కానీ ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కనీసం మరో రెండు నెలల పాటు ఇసుక కష్టాలు తప్పేటట్టు లేవు. ఇసుక నిల్వల విక్రయాలకు సైతం గడువు ముగియనుంది. దీంతో ఇసుక దొరకడమే గగనంగా మారనుంది. రాత్రి వేళల్లో గోదావరి గర్భాన్ని డొల్ల చేస్తున్న అక్రమార్కుల పుణ్యమాని ఒకవేళ దొరికినా యూనిట్ (మూడు ఘనపు మీటర్లు అంటే దాదాపు ఓ ట్రాక్టర్ లోడు) ఇసుక రేటు రూ.ఐదువేలకు పెరగనుంది. సంపన్నుల సంగతేమో కానీ, సామాన్యులు ఒంటి ఇటుక గోడతో ఒక్క గది కట్టుకోవాలన్నా భారంగా మారనుంది. జిల్లాలో 28 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, అమ్మకాలకు గడువు ముగిసి చాలా కాలమైంది. వీటిలో కొన్నింటిని లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినా వ్యవహారం కోర్టుకు చేరడంతో నిలిచిపోయింది. మరో పక్క ఇసుక నిల్వల అమ్మరానికి ఇచ్చిన గడువు కూడా సమీపిస్తోంది. కపిలేశ్వరపురం, కోరుమిల్లిల వద్ద ఉన్న నిల్వల అమ్మకాలకు శనివారం గడువు ముగియనుండగా, వంగలపూడి వద్ద ఉన్న నిల్వలకు వచ్చే ఫిబ్రవరి వరకు, వేమగిరి వద్ద ఉన్న నిల్వలకు వచ్చే మే వరకు గడువుంది. కాగా లీజు ముగిసి, పర్యావరణ అనుమతులున్న ఇసుక రీచ్‌లను ప్రభుత్వ పాలసీకనుగుణంగా కేటాయింపులు జరపాలని హైకోర్టు రెండు నెలల క్రితం ఆదేశించింది. గత డ్వామా పీడీ అలసత్వం, సమైక్యాంధ్ర ఉద్యమంతో సరిహద్దుల గుర్తింపు, మైనింగ్ అనుమతులు పొందడంలో తీవ్రజాప్యం జరిగింది. ఇప్పటి వరకు కొండుకుదురు, టేకిశెట్టిపాలెం, దిండి, బో డసకుర్రు, కొత్తపేట-కేదార్లంక, గోపాలపురం రీచ్‌లకు మైనింగ్ అనుమతులు ల భించాయి. పెదపట్నం-అప్పనపల్లి, పాశర్లపూడి, సోంపల్లి, అంకంపాలెం, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, వేమగిరి, ముగ్గళ్ల, కోటిపల్లి రీచ్‌లకు సం బంధించి మైనింగ్ అనుమతుల కోసం పంపారు. మిగిలిన ఊబలంక, ఇంజరం, పిల్లంక, ఎదుర్లంక, గుత్తెనదీవి, మందపల్లి, అయినవిల్లిలంక-వీరవల్లిపాలెం, జొన్నాడ, రాజమండ్రి, పశువుల్లంక, కేశనకుర్రు రీచ్‌లు ఇంకా మైనింగ్ ప్లాన్ల తయారీ దశలోనే ఉన్నాయి. మైనింగ్ అనుమతులున్న రీచ్‌లకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)పరిధిలోని స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఎసెస్మెంట్ అథారిటీ నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. అయితే పీసీబీకి రాష్ర్ట స్థాయిలో పాలకమండలి లేకపోవడంతో అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. కేంద్రం తాత్సారం : పీసీబీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం కోరినా కేంద్రం కొన్ని నెలలుగా జాప్యం చేస్తోంది. ఈ కారణంగానే రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గడువు ముగిసిన రీచ్‌లకు పర్యావరణ అనుమతుల మంజూరు లభించలేదు. కొత్త పాలకమండలి ఏర్పాటుకు నెల రోజులకు పైగా పడుతుందని, ఆ తర్వాత మ రో నెల రోజులకు కానీ మైనింగ్ అ నుమతులు ఉన్న రీచ్‌లకు అనుమతి లభించదని అంటున్నారు. కాగా ప ర్యావరణ అనుమతులొచ్చాక పారదర్శకతతో ప్రభుత్వ విధానానికనుగుణంగా రీచ్‌లు కేటాయిస్తామని కొ త్తగా బాధ్యతలు స్వీకరించిన డ్వా మా పీడీ సంపత్‌కుమార్ చెప్పారు. -
క్రీడా మంత్రి హడావిడి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం... మరో వైపు తెలంగాణాలో శాంతి ర్యాలీలు వగైరా సాగుతూనే ఉన్నాయి. కీలక ప్రభుత్వ శాఖలు దాదాపుగా స్థంభించిపోయా యి. ఇలాంటి స్థితిలో క్రీడా శాఖ మంత్రి వట్టి వసంత కుమార్‌కు ఒక్కసారిగా రాష్ట్రంలో క్రీడలపై ప్రేమ కలిగింది. దాంతో ఈ శాఖ సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. అదేదో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి గురించో, మినీ స్టేడియాల నిర్మాణం గురించో, లేదంటే పేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడం గురించో అయితే ఫర్వాలేదు. అయితే కేవలం కొంత మందికి వ్యక్తిగత ప్రయోజనం కలిగించేందుకే ఈ హడావిడి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. క్రీడా శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మరో మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు. పైగా సాధారణంగా మంత్రులు సమీక్షలు జరిపే సచివాలయంలో కాకుండా దీనిని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఇదేమీ అంత అత్యవసర సమావేశం కాదు. ఇందులో వాస్తవానికి సమీక్షకంటే... నిబంధనలకు విరుద్ధంగా తనకు కావాల్సిన ఫైళ్లు సిద్ధం చేయమంటూ ‘శాప్’ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు రూ. 50 లక్షలు ఇచ్చే విధంగా ఫైలు సిద్ధం చేయాలంటూ ‘శాప్’ అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సింధు రూ.5 లక్షలకే అర్హురాలు. థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్, మాల్దీవ్స్ చాలెంజ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన శ్రీకాంత్, నందగోపాల్‌లకు కూడా ఇదే తరహాలో నగదు పురస్కారం ఇప్పించాలని మంత్రి భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక చెస్ క్రీడాకారిణికి, గుంటూరులో హాకీ టోర్నీ నిర్వహణకు హాకీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 25 లక్షలు ఇచ్చేందుకు... ఇలా మంత్రిగారి సమీక్ష మొత్తం వీటిపైనే సాగింది. హాకీ సమాఖ్యలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో డబ్బులు ఇవ్వడం వీలు కాదంటూ రెండు వారాల క్రితమే హాకీ సంఘం అభ్యర్థనను ‘శాప్’ తిప్పి పంపింది. ఇప్పుడు అదే ఫైలును మంత్రి ముందుకు నెడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రిని ఆటతో సంబంధం లేని కొంత మంది వ్యక్తులు బాగా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే క్రీడ అన్నట్లుగా వారు మంత్రికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. తగిన నిధులు లేక రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఆగిపోయింది. మూడేళ్లుగా టోర్నీల కోసం ఖర్చు పెట్టిన రూ. 80 లక్షలు ఇవ్వాలంటూ స్వయంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా పైసా రాలేదు. ఇప్పుడు ఒక్కో ఆటగాడికి లక్షలు కుమ్మరించాలని ప్రయత్నించడం నిజంగా అన్యాయం. - ఏపీ ఒలింపిక్ సంఘం ప్రతినిధి ఆవేదన -
క్రీడా మంత్రి హడావిడి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం... మరో వైపు తెలంగాణాలో శాంతి ర్యాలీలు వగైరా సాగుతూనే ఉన్నాయి. కీలక ప్రభుత్వ శాఖలు దాదాపుగా స్థంభించిపోయా యి. ఇలాంటి స్థితిలో క్రీడా శాఖ మంత్రి వట్టి వసంత కుమార్‌కు ఒక్కసారిగా రాష్ట్రంలో క్రీడలపై ప్రేమ కలిగింది. దాంతో ఈ శాఖ సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. అదేదో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి గురించో, మినీ స్టేడియాల నిర్మాణం గురించో, లేదంటే పేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడం గురించో అయితే ఫర్వాలేదు. అయితే కేవలం కొంత మందికి వ్యక్తిగత ప్రయోజనం కలిగించేందుకే ఈ హడావిడి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. క్రీడా శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మరో మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు. పైగా సాధారణంగా మంత్రులు సమీక్షలు జరిపే సచివాలయంలో కాకుండా దీనిని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఇదేమీ అంత అత్యవసర సమావేశం కాదు. ఇందులో వాస్తవానికి సమీక్షకంటే... నిబంధనలకు విరుద్ధంగా తనకు కావాల్సిన ఫైళ్లు సిద్ధం చేయమంటూ ‘శాప్’ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు రూ. 50 లక్షలు ఇచ్చే విధంగా ఫైలు సిద్ధం చేయాలంటూ ‘శాప్’ అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సింధు రూ.5 లక్షలకే అర్హురాలు. థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్, మాల్దీవ్స్ చాలెంజ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన శ్రీకాంత్, నందగోపాల్‌లకు కూడా ఇదే తరహాలో నగదు పురస్కారం ఇప్పించాలని మంత్రి భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక చెస్ క్రీడాకారిణికి, గుంటూరులో హాకీ టోర్నీ నిర్వహణకు హాకీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 25 లక్షలు ఇచ్చేందుకు... ఇలా మంత్రిగారి సమీక్ష మొత్తం వీటిపైనే సాగింది. హాకీ సమాఖ్యలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో డబ్బులు ఇవ్వడం వీలు కాదంటూ రెండు వారాల క్రితమే హాకీ సంఘం అభ్యర్థనను ‘శాప్’ తిప్పి పంపింది. ఇప్పుడు అదే ఫైలును మంత్రి ముందుకు నెడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రిని ఆటతో సంబంధం లేని కొంత మంది వ్యక్తులు బాగా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే క్రీడ అన్నట్లుగా వారు మంత్రికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. తగిన నిధులు లేక రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఆగిపోయింది. మూడేళ్లుగా టోర్నీల కోసం ఖర్చు పెట్టిన రూ. 80 లక్షలు ఇవ్వాలంటూ స్వయంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా పైసా రాలేదు. ఇప్పుడు ఒక్కో ఆటగాడికి లక్షలు కుమ్మరించాలని ప్రయత్నించడం నిజంగా అన్యాయం. - ఏపీ ఒలింపిక్ సంఘం ప్రతినిధి ఆవేదన