తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ ఇవ్వమని అడిగినందుకు అపార్ట్‌మెంట్ వాసులను వేదించిన కేసులో ఏపీ సీఐడీ డీఎస్పీ వసంతకుమార్‌ను అరెస్ట్ చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్‌సిటీః తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ ఇవ్వమని అడిగినందుకు అపార్ట్‌మెంట్ వాసులను వేదించిన కేసులో ఏపీ సీఐడీ డీఎస్పీ వసంతకుమార్‌ను అరెస్ట్ చేసిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
చిక్కడపల్లి చందనబ్రదర్స్ ఎదురుగా ఉన్న పూర్ణఆదిత్య రెసిడెన్సీలో నివసించే ఏపి సిఐడి డిఎస్పీ వసంతకుమార్ గత కొంతకాలంగా అపార్ట్‌మెంట్ మెయింట్‌నెన్స్ డబ్బును చెల్లించడం లేదు. దీంతో అపార్ట్‌మెంట్ యాజమాన్యం మెయింట్‌నెన్స్ ఇవ్వాలని అడగడంతో వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు వసంత్‌కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతనిపై 362, 462, 506 సెక్షన్‌ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుదర్శన్ తెలిపారు.