సాక్షి, విశాఖపట్నం: సంచలనంగా మారిన రీతి సాహ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. రీతి సాహ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్ట్‌ల పర్వం కూడా మొదలైంది. తాజాగా నలుగురిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సాధన హాస్టల్‌కు చెందిన ఇద్దరు, బైజూస్ యజమాన్యానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో సాధన హాస్టల్ ఓనర్ లక్ష్మీ, వార్డెన్ కుమారి, ఆకాష్ బైజూస్ కాలేజీ మేనేజర్ సూర్యకాంత్, అసిస్టెంట్ మేనేజర్ రామేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, వీరి నిరక్ష్యం కారణంగానే రీతి సాహ చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మరోవైపు.. వెంకటరామ, కేర్ ఆసుపత్రిలో కూడా సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బెంగాల్ పోలీసులు, సీఐడీ విశాఖలోనే మకాం వేసి దూకుడు పెంచారు.
ఇది కూడా చదవండి: ఐటీ నోటీసులు.. అడ్డంగా బుక్కైనా నోరు విప్పని చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment