కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వేధిస్తున్నారంటూ నర్సులు, ఏఎన్ఎం లు ఆరోపిస్తున్నారు.
చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వేధిస్తున్నారంటూ నర్సులు, ఏఎన్ఎం లు ఆరోపిస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే డాక్టర్ వసంతరావు లైంగికంగా వేధిస్తున్నారని వారు సోమవారం విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళతామంటూ కరీంనగర్ తరలి వెళ్లారు.