
ఆండ్రియా
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి. వెంకటేష్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఇందులో భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి.
ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కథ సాగుతుంది. నేటి యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు సినిమాలో ఉంటాయి. హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌గార్లు విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment