andria
-
అతిథిగా ఆండ్రియా
లీడ్ రోల్, కీలక పాత్ర, అతిథి పాత్ర... ఇలా ఏదైనా సరే పాత్ర భిన్నంగా ఉంటే రెడీ అంటారు గాయని, నటి ఆండ్రియా. ప్రస్తుతం మూడు తమిళ సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా ఉన్నారామె. ఈ ఏడాది ఆండ్రియా థియేటర్లో కనిపించనేలేదు. మూడు సినిమాలూ చిత్రీకరణ దశలోనే ఉండటమే అందుకు కారణం. తాజాగా మరో సినిమా కూడా అంగీకరించారట ఆండ్రియా. విజయ్ హీరోగా ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆండ్రియాను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారట చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీలో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట ఆండ్రియా. -
నా మనసుకు నచ్చిన చిత్రమిది
జె.ఎస్.కె ఫిలింస్ కార్పొరేషన్ సమర్పణలో అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకుడు. డి.వి.వెంకటేశ్, ఉదయ్ హర్ష వడ్డేల్ల ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్, ఉదయ్ ఎంతో అభిరుచి ఉన్న నిర్మాతలు. ట్రైలర్ చూశాక ఇది రియలిస్టిక్ ఫిల్మ్ అని అర్థమైంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్‌ని ఇప్పటి సినిమాలు చెబుతున్నాయి. ఇది అలాంటి సినిమానే’’ అన్నారు. డీవీ వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘తమిళ్లో పెద్ద హిటై్టన చిత్రమిది. తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నాం, కానీ కుదర్లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎక్కడా రాజీపడకుండా అనువాదం చేశాం’’ అన్నారు. మరో నిర్మాత ఉదయ్ మాట్లాడుతూ– ‘‘సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? అనేది ప్రధానాంశం’’ అన్నారు. హీరోయిన్ ఆండ్రియా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం తమిళ్లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. నా మనసుకు నచ్చిన చిత్రమిది. తెలుగు ట్రైలర్ చూశాక చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగులో ఈ సినిమా విడుదల అవటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, పద్మిని తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీ మాయ
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డి.వి. వెంకటేష్ తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 6న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇదొక ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఇందులో భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు సమపాళ్లలో ఉంటాయి. ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కథ సాగుతుంది. నేటి యువత టెక్నాలజీ మాయలో పడి ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అనే అంశాలు సినిమాలో ఉంటాయి. హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్‌గార్లు విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. -
‘ఈరోజుల్లో’ స్టైల్లో ఉంది – మారుతి
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ముఖ్య తారలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాని జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్లో డి.వెంకటేశ్ తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్ ఏరియా పేరే ‘తారామణి’. ఈ సినిమాని ఇటీవల చూశాను. ‘ఈరోజుల్లో’ సినిమా స్టైల్లో ట్రెండ్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంది. సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్ క్రాస్ చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్‌గారు కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తమిళంలో పెద్ద సక్సెస్ సాధించిన చిత్రమిది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్టైన్మెంట్గా చూపించడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా ఇది. తప్పకుండా తెలుగులోనూ సక్సెస్ అవుతుంది’’ అన్నారు డి.వెంకటే‹శ్. నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, మల్టీడైమన్షన్ వాసు, మాటల రచయిత ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. -
హన్సిక 'చంద్రకళ' స్టిల్స్
-
ఆండ్రియాతో కమల్ ప్రేమాయణం ?!
-
శింబు, ఆండ్రియాల సాన్నిహిత్యం
నటుడు శింబు, నటి ఆండ్రియా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారని, ఇది మింగుడుపడని శింబు ప్రేయసి హన్సిక షాక్‌కు గురైందని తాజా సమాచారం. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన నటుడు శింబు నిజ జీవితంలో నటి నయనతారతో లవ్ డ్యూయెట్లు పాడారు. వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కకుండానే ముక్కలైంది. సమీప కాలంలో నటి హన్సిక, శింబు ప్రేమ లో పడ్డారు. వీరు వెట్టై మన్నన్, వాలు చిత్రాల్లో నటిస్తున్నప్పుడు ప్రేమకు బీజం పడింది. వీరి గురించి రకరకాల ప్రచారం జరగడంతో ఒక ఫైన్‌డే ‘మేము ప్రేమించుకుం టున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం’ అంటూ శింబు, హన్సిక బహిరంగంగా ప్రకటించారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శింబు ఇటీవల సొంతంగా ఒక అం దమైన భవనాన్ని కట్టించుకుని గృహ ప్రవేశం కూడా చేశాడు. ఇక హన్సికతో పెళ్లే తరువాయి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాతే తమ పెళ్లి ఉంటుందని నటి హన్సిక స్టేట్మెంట్ ఇచ్చింది. దీని వెనుక ఆమె తల్లి ఒత్తిడి ఉందన్నది అసలు విషయం. నటిగా హన్సిక కెరీర్ ప్రస్తుతం చాలా బ్రైట్‌గా ఉంది. చేతినిండా చిత్రాలున్నాయి. విజయాల బాటలో పయనిస్తోంది. పారితోషికం బాగా డిమాండ్ చేస్తోంది. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సామెతను హన్సిక తల్లి అమలుచేస్తోంది. పెళ్లి చేసుకుంటే నటనకు స్వస్తి చెప్పాలి. లక్షల ఆదాయానికి గండి పడుతుంది. అలా జరగడం హన్సిక తల్లికి ఇష్టం లేదు. ఇది శింబుకు మింగుడు పడ లేదు. దీంతో వారి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో హాస్యనటుడు వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఇంగ ఎన్న సొల్లుదు చిత్రంలో శింబు అతిథి పాత్ర పోషిస్తున్నాడు. ఈయన సరసన సంచలన నటి ఆండ్రియా నటిస్తోంది. ఈమె ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుద్‌తో ప్రేమ కలాపాలు సాగించింది. అది నెట్లో హల్చల్ చేయడంతో ముగిసిపోయిన ప్రేమ కథ అంటూ తేలిగ్గా కొట్టి పారేసింది. తాజా గా శింబుతో సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. ఇంగ ఎన్న సొల్లుదు చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు టాక్. ఈ టాక్ నటి హన్సికకు పెద్ద షాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.