‘ఈరోజుల్లో’ స్టైల్‌లో ఉంది – మారుతి | Taramani Movie Theatrical Trailer Launch | Sakshi

‘ఈరోజుల్లో’ స్టైల్‌లో ఉంది – మారుతి

May 8 2018 12:21 AM | Updated on May 8 2018 12:21 AM

Taramani Movie Theatrical Trailer Launch  - Sakshi

శ్రేయాస్‌ శ్రీనివాస్, డి. వెంకటేశ్, మారుతి, అచ్చిరెడ్డి, మల్టీడైమన్షన్‌ వాసు

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ముఖ్య తారలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ్‌లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాని జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, గుడ్‌ సినిమా గ్రూప్‌ బ్యానర్‌లో డి.వెంకటేశ్‌ తెలుగులో అదే పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్‌ ఏరియా పేరే ‘తారామణి’. ఈ సినిమాని ఇటీవల చూశాను.

‘ఈరోజుల్లో’ సినిమా స్టైల్‌లో ట్రెండ్‌కి మ్యాచ్‌ అయ్యేలా ఉంది. సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్‌ క్రాస్‌ చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్‌గారు కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తమిళంలో పెద్ద సక్సెస్‌ సాధించిన చిత్రమిది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూపించడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా ఇది. తప్పకుండా తెలుగులోనూ సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు డి.వెంకటే‹శ్‌. నిర్మాతలు కె. అచ్చిరెడ్డి, మల్టీడైమన్షన్‌ వాసు, మాటల రచయిత ‘డార్లింగ్‌’ స్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement