
తమిళసినిమా: సినీరంగంలో పురుషాధిక్యమే రాజ్యమేలుతోందన్నది వాస్తవం. స్టార్ హీరోల కనుసన్నల్లోనే సినిమా రూపొందుతోంది. నయనతార లాంటి నటీమణులే హీరోలకు ధీటుగా హీరోయిన్ పాధాన్యత చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఎలాంటి పాత్ర అయినా నటనకు అవకాశం ఉంటే నటించేందుకు వెనుకాడని నటి ఆండ్రియా పేర్కొన్నారు. ఇటీవల తరమణి చిత్రంలో ఎవరూ నటించడానికి సాహసించని పాత్రలో నటించి మెప్పించారు.అయినప్పటికీ ఈ ఉత్తరాది బ్యూటీ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. ఈ విషయంపై సినీ వర్గాలకు ఇటీవల ఘాటుగానే చురకలంటించారు.
ఆండ్రియా ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ నటుడు విజయ్‌కి జంటగా ఒక చిత్రంలో నటిస్తూ ఏమీ చేయకుండానే మూడు పాటల్లో ఆయనతో ఆడితే ఆ చిత్రం విడుదలై విజయం సాధిస్తే ఆ నటికి వరుసగా నాలుగైదు చిత్రాల అవకాశాలు వరించేస్తున్నాయి అని అన్నారు. అయితే తరమణి లాంటి చిత్రంలో ఉత్తమ నటనను ప్రదర్శించిన తనకు ప్రశంసలు అభించాయే గానీ ఆ తరువాత కొత్తగా ఒక్క అవకాశం రాలేదని అన్నారు. అయితే నటి నయనతార కూడా ఆదిలోనే రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ హీరోల జంటగా నటించిన తరువాతే ఆమెకు స్టార్ హీరోయిన్ అంతస్తు లభించిందని అన్నారు. అలా జరగకుంటే నయనతార గురించి ఇంతగా బయట ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. తానేమంటానంటే ఒక నటి ప్రతిభను ఆమె ఎవరితో నటించారన్నదాన్ని బట్టి నిర్ణయించరాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment