
ఛాలెంజింగ్ కథలను, పాత్రలను ఎంపిక చేసుకుని తన పరిధిని పెంచుకుంటూ నటనా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మీరందరూ మెచ్చుకునే విధంగా తన చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ
తరమని చిత్రంతో నటుడుగా తనదైన ముద్రవేసుకున్న వసంత రవి ఆ తర్వాత రాఖీ చిత్రంతో మాస్ హీరోగా ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం అశ్విన్స్. 25 రోజుల క్రితం విడుదలైన ఈ వైవిధ్యభరిత హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేటికీ థియేటర్లలో కొనసాగుతోంది. దీంతో హీరో వసంత రవి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో చిత్ర యూనిట్ రేయింబవళ్లు కష్టపడి రూపొందించిన చిత్రం అశ్విన్స్ అని పేర్కొన్నారు.
పలు సమస్యలను ఎదురొడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. ఇది పరిచయంలేని ముఖాలతో తక్కువ బడ్జెట్లో నిర్మించిన చిత్రమన్నది తెలిసిందేనని, ఇలాంటి చిత్రాలు థియేటర్లో వారానికి పైగా ప్రదర్శించడం సవాల్‌తో కూడిన పని అని తెలిపారు. అలాంటిది ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం 25 రోజులు దాటి ప్రదర్శితమవడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి విజయానికి కారణమైన చిత్ర దర్శకుడు తరుణ్ తేజా, నిర్మాత బాపినీడు, తమను నమ్మి ఇందులో భాగస్వామ్యం పంచుకున్న ప్రవీణ్‌లకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
ఛాలెంజింగ్ కథలను, పాత్రలను ఎంపిక చేసుకుని తన పరిధిని పెంచుకుంటూ.. నటనా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మీరందరూ మెచ్చుకునే విధంగా తన చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని వసంత రవి అన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఈయన ముఖ్యపాత్రను పోషించారన్నది తెలిసిన విషయమే!