Asvins Movie
-
అశ్విన్స్ సక్సెస్.. బాధ్యత మరింత పెరిగిందన్న హీరో
తరమని చిత్రంతో నటుడుగా తనదైన ముద్రవేసుకున్న వసంత రవి ఆ తర్వాత రాఖీ చిత్రంతో మాస్ హీరోగా ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం అశ్విన్స్. 25 రోజుల క్రితం విడుదలైన ఈ వైవిధ్యభరిత హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ నేటికీ థియేటర్లలో కొనసాగుతోంది. దీంతో హీరో వసంత రవి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందులో చిత్ర యూనిట్ రేయింబవళ్లు కష్టపడి రూపొందించిన చిత్రం అశ్విన్స్ అని పేర్కొన్నారు. పలు సమస్యలను ఎదురొడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. ఇది పరిచయంలేని ముఖాలతో తక్కువ బడ్జెట్లో నిర్మించిన చిత్రమన్నది తెలిసిందేనని, ఇలాంటి చిత్రాలు థియేటర్లో వారానికి పైగా ప్రదర్శించడం సవాల్‌తో కూడిన పని అని తెలిపారు. అలాంటిది ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం 25 రోజులు దాటి ప్రదర్శితమవడం సంతోషంగా ఉందన్నారు. ఇంతటి విజయానికి కారణమైన చిత్ర దర్శకుడు తరుణ్ తేజా, నిర్మాత బాపినీడు, తమను నమ్మి ఇందులో భాగస్వామ్యం పంచుకున్న ప్రవీణ్‌లకు కతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఛాలెంజింగ్ కథలను, పాత్రలను ఎంపిక చేసుకుని తన పరిధిని పెంచుకుంటూ.. నటనా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మీరందరూ మెచ్చుకునే విధంగా తన చిత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని వసంత రవి అన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఈయన ముఖ్యపాత్రను పోషించారన్నది తెలిసిన విషయమే! చదవండి: బేబి సినిమాకు వీళ్ల రెమ్యునరేషన్ ఇంత తక్కువా? -
ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అశ్విన్స్ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా బవాల్ - హిందీ మూవీ అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా ఆహా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ - తెలుగు సినిమా నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో జీ5 మౌరా - పంజాబీ చిత్రం జియో సినిమా ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22 స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23 దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) -
ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ
Asvins OTT Release Date: ఓటీటీల్లో ఈ మధ్య సరైన హారర్ సినిమాలు రావడం లేదు! కొన్ని వస్తున్నా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేయడానికా అన్నట్లు ఓ క్రేజీ హారర్ మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైపోయింది. తాజాగా దీని విడుదల తేదీని ప్రకటించారు. ఈ క్రమంలో హారర్ మూవీ లవర్స్ ఎప్పుడు చూడాలా అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణంగా హారర్ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది. కరెక్ట్‌గా తీయాలే గానీ భయపెడుతూనే, కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధిస్తాయి. అలా గత నెల 23న థియేటర్లలోకి వచ్చిన చిత్రం 'అశ్విన్స్'. పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం వల్లో ఏమో తెలియదు గానీ స్టోరీ, సౌండ్ డిజైనింగ్ బాగున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆడలేదు. పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమానే జూలై 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'అశ్విన్స్' కథేంటి? అర్జున్(వసంత్ రవి)తో పాటు అతడి నలుగురు ఫ్రెండ్స్ యూట్యూబర్స్. తమ ఛానెల్ కోసం డార్క్ టూరిజం మీద ఓ వీడియో తీయాలలని లండన్ లోని ఓ ఐలాండ్ లో ఉన్న బిల్డింగ్ కి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలిజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన 15 మందిని ఆమె చంపేసిందనే ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇది తెలిసినప్పటికీ అర్జున్ అతడి ఫ్రెండ్స్ ఇంట్లో అడుగుపెడతారు. ఆ బిల్డింగ్ లో సంచరించే ఆత్మలు, వాటి అరుపులని తమ కెమెరాలు, వాయిస్ రికార్డ్ పరికరాలతో క్యాప్చర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ ఐదుగురి జీవితాల్లో ఒక్క రాత్రిలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అసలు ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది? చివరకు అర్జున్ టీమ్ బతికారా లేదా అనేది తెలియాలంటే మీరు 'అశ్విన్స్' సినిమా చూడాలి. మంచి సౌండ్ బాక్స్ సెటప్ మీ దగ్గరుంటే మాత్రం ఈ మూవీ మిమ్మల్ని కచ్చితంగా థ్రిల్ చేస్తుంది. Put your seat belts on because you're about to go on a jumpy ride👻 Asvins is coming to Netflix in Tamil, Telugu, Malayalam and Kannada on 20th July. #AsvinsOnNetflix pic.twitter.com/fgNxf30AbK — Netflix India South (@Netflix_INSouth) July 17, 2023 (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) -
ఈ వారం రిలీజైన సినిమాలు ఎలా ఉన్నాయంటే..
‘ఆదిపురుష్’ విడుదలై దాదాపు పది రోజుల కావోస్తుంది. టాక్ సంగతి పక్కన పెడితే తొలి మూడు రోజుల మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. కానీ ‘ఆదిపురుష్’ భయానికి ఈ వారం పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. కానీ అరడజనుపై చిన్న సినిమాలు అయితే విడుదలయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించుకోలేకపోయాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం కొంతవరకు ప్రేక్షకులను అలరించాయి. మరి ఈ వారం విడుదలైన సినిమాల కథేంటి? ఎలా ఉన్నాయి? అశ్విన్స్ థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మను చరిత్ర శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘మనుచరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రేమ, గూండాయిజం నేపథ్యంలో సాగిన మనుచరిత్ర ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మా ఆవారా జిందగీ ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) భీమదేవరపల్లి బ్రాంచి టాలీవుడ్ లో ఈ మధ్య తెలంగాణ కల్చర్ ఆధారంగా తీస్తున్న సినిమాల పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బలగం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 'మేమ్ ఫేమస్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. అదే 'భీమదేవరపల్లి బ్రాంచి’ మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) భారీ తారాగారం విఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కర్ణ యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కర్ణ. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటించడం విశేషం. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరికొత్త అనుభూతినిస్తుంది
‘‘తరుణ్ తేజతో కలిసి మా అబ్బాయి బాపినీడు హారర్ జోనర్లో ‘అశ్విన్స్’ సినిమా నిర్మించాడు. ఈ చిత్రం విజువల్స్, సౌండింగ్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వసంత్ రవి హీరోగా, విమలా రామన్ కీ రోల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వంలో బాపినీడు బి. సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ– ‘‘అశ్విన్స్’ కాన్సెప్ట్‌తో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. అది చూసిన బాపినీడుగారు అదే కాన్సెప్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌లా చేద్దామన్నారు. ప్రసాద్‌గారు, బాపినీడుగారి సహకారంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘అశ్విన్స్’ తరుణ్ కల.. దాన్ని నెరవేర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విమలా రామన్. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అశ్విన్స్’ వంటి మంచి చిత్రంతో రావటం హ్యాపీగా ఉంది’’ అన్నారు వసంత్ రవి. -
Asvins Review: ‘అశ్విన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్విన్స్ నటీనటులు: సంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సిమ్రాన్ పరీక్, ఉదయ దీప్, సరస్వతి మీనన్ తదితరులు నిర్మాణ సంస్థ:శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్ దర్శకత్వం: తరుణ్ తేజ సంగీతం: విజయ్ సిద్ధార్థ్ విడుదల తేది: జూన్ 23, 2023 థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా మీడియా కోసం ఈ మూవీ ప్రివ్యూ వేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో రివ్యూలో చూద్దాం. అశ్విన్స్ కథేంటంటే.. అర్జున్(వసంత్ రవి), రీతు, రాహుల్, గ్రేస్, వరుణ్..ఐదుగురు యూట్యూబర్స్. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు డార్క్ టూరిజం మీద ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించాలని లండన్‌లోని ఓ దీవిలో ఉన్న భవంతికి వెళ్తారు. అక్కడ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) ఆత్మ తిరుగుతుందని, గతంలో అక్కడి వెళ్లిన ఓ 15 మందిని ఆమే చంపేసిందనే ప్రచారం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ టీమ్.. ఆ భవంతిలో సంచరించే ఆత్మలను, అరుపులను తమ కెమెరాలో బంధించాలని ప్రయత్నిస్తారు. మరి అలా వెళ్లిన ఐదుగురికి భవంతిలో కలిగిన వింత అనుభవాలు ఏంటి? ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్ ఎలా చనిపోయింది. ఓ రైతుకు అశ్వినీదేవతలు ఇచ్చిన వరం ఏంటి? ఆ వరాన్ని రాక్షస ఆత్మ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంది. అశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మలు కనుగొన్న తర్వాత ఆర్తి రాజగోపాల్ ఎదురైన సమస్యలు ఏంటి? తనవాళ్లను కాపాడుకోవడానికి అర్జున్ చేసిన సాహసం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్విన్స్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు అనే రెండు పర్శ్వాలుంటాయి. బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే... మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. ఎంతో నిగ్రహంతో మన మనసుని మార్చుకొని బుద్దితో మంచి వైపు ప్రయాణిస్తే అంతా బాగుంటుంది. మంచి.. చెడు ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి మనిషికి మాత్రమే ఉంటుందనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు దర్శకుడు తరుణ్ తేజ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ దానిని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. సినిమా మొత్తాన్ని ఐదు చాప్టర్లు( Two deaths,Two voices, Two curses, The mind of two worlds, The world of two minds) చూపించారు. రైతు ఇద్దరు కుమారు చనిపోవడం.. అశ్వినీదేవతలు ప్రత్యేక్షమై వరం ఇవ్వడం.. రాక్షస ఆత్మ ఆశ్వినీ దేవతలు ఇచ్చిన రెండు బొమ్మల్లో ఒకదానిని దొంగిలించి.. భూమి మీదకు రావడం..ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా రొటీన్ హారర్ చిత్రాల్లాగే సాగుతుంది. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఉండదు కానీ విచిత్రమైన సౌండ్లతో ఆడియన్స్‌ని భయపెట్టడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్(విమలా రామన్)నేపథ్యంతో అసలు సినిమా స్వభావం ఏంతో తెలిసిపోతుంది. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను భయపెట్టడం మీదే దృష్టిపెట్టిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు కథను వెల్లడించి థ్రిల్లింగ్‌కు గురి చేశాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తంగా ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఓ మంచి సందేశాన్ని అందించారు. ఎవరెలా చేశారంటే.. అర్జున్ పాత్రలో వసంత్ రవి ఒదిగిపోయాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన రవి, ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఇక రవి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విమలా రామన్‌ది. ఆర్కియాలజిస్ట్ ఆర్తి రాజగోపాల్‌గా ఆమె చక్కగా నటించి మెప్పించింది.మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం విజయ్ సిద్ధార్థ్ అందించిన నేపథ్య సంగీతం. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆడియన్స్‌ని భయపెట్టాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ మొత్తం సౌండ్స్‌తోనే థ్రిల్లింగ్‌కి గురి చేశాడు. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.