‘ఆదిపురుష్’ విడుదలై దాదాపు పది రోజుల కావోస్తుంది. టాక్ సంగతి పక్కన పెడితే తొలి మూడు రోజుల మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. కానీ ‘ఆదిపురుష్’ భయానికి ఈ వారం పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. కానీ అరడజనుపై చిన్న సినిమాలు అయితే విడుదలయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించుకోలేకపోయాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం కొంతవరకు ప్రేక్షకులను అలరించాయి. మరి ఈ వారం విడుదలైన సినిమాల కథేంటి? ఎలా ఉన్నాయి?
అశ్విన్స్
థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్‌లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మను చరిత్ర
శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘మనుచరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రేమ, గూండాయిజం నేపథ్యంలో సాగిన మనుచరిత్ర ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?
(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మా ఆవారా జిందగీ
ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్‌లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది
(పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
భీమదేవరపల్లి బ్రాంచి
టాలీవుడ్ లో ఈ మధ్య తెలంగాణ కల్చర్ ఆధారంగా తీస్తున్న సినిమాల పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బలగం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 'మేమ్ ఫేమస్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. అదే 'భీమదేవరపల్లి బ్రాంచి’ మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
భారీ తారాగారం
విఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కర్ణ
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కర్ణ. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటించడం విశేషం. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment