Maa Awara Zindagi Movie
-
ఈ వారం రిలీజైన సినిమాలు ఎలా ఉన్నాయంటే..
‘ఆదిపురుష్’ విడుదలై దాదాపు పది రోజుల కావోస్తుంది. టాక్ సంగతి పక్కన పెడితే తొలి మూడు రోజుల మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. కానీ ‘ఆదిపురుష్’ భయానికి ఈ వారం పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. కానీ అరడజనుపై చిన్న సినిమాలు అయితే విడుదలయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించుకోలేకపోయాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం కొంతవరకు ప్రేక్షకులను అలరించాయి. మరి ఈ వారం విడుదలైన సినిమాల కథేంటి? ఎలా ఉన్నాయి? అశ్విన్స్ థ్రిల్లర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే సస్పెన్స్, హర్రర్, థ్రిల్లింగ్ జానర్ లో తరచూ సినిమాలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువశాతం బాక్సాపీస్ వద్ద విజయం సాధించినవే ఉంటాయి. ఇక తాజాగా ఇదే జానర్లో ‘అశ్విన్స్’అనే చిత్రం తెరకెక్కింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ‘తారామణి’ ఫేం వసంత్ రవి, విమలా రామన్ కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మను చరిత్ర శివ కందుకూరి హీరోగా, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘మనుచరిత్ర’. భరత్ పెదగాని దర్శకత్వంలో ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రేమ, గూండాయిజం నేపథ్యంలో సాగిన మనుచరిత్ర ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) మా ఆవారా జిందగీ ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) భీమదేవరపల్లి బ్రాంచి టాలీవుడ్ లో ఈ మధ్య తెలంగాణ కల్చర్ ఆధారంగా తీస్తున్న సినిమాల పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 'బలగం' లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. 'మేమ్ ఫేమస్' బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేసింది. అదే 'భీమదేవరపల్లి బ్రాంచి’ మరి ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) భారీ తారాగారం విఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ తారాగణం. శేఖర్ ముత్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.వి రెడ్డి నిర్మించాడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కర్ణ యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కర్ణ. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటించడం విశేషం. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎలా ఉంది? (పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Maa Awara Zindagi Movie: ‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ
టైటిల్: మా ఆవారా జిందగీ నటీనటులు: బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ తదితరులు నిర్మాణసంస్థ: విభా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: నంద్యాల మధుసూదన్ రెడ్డి దర్శకుడు:దేపా శ్రీకాంత్ రెడ్డి సంగీతం-ప్రతీక్ నాగ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి ఎడిటర్: సాయిబాబు తలారి విడుదల తేది: జూన్ 23, 2023 ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే? భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ (ఎల్బీ), జస్వంత్ (లంబు) నలుగురు కుర్రాళ్లు పనీపాట లేకుండా ఖాళీగా, అవారాగా తిరుగుతుంటారు. ఎప్పుడూ తాగడం, జల్సాలు చేయడమే వీరి పని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షియాజీ షిండే) ప్రతీ సారి వీరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. ఎస్సై కూతురు కిడ్నాప్‌కు గురవుతుంది. కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్‌లో ఆ నలుగురి ప్రమేయం ఉందా? చివరకు ఆ నలుగురు చేసిన పనులేంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే?.. శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు అల్లరి చిల్లరగా కనిపించే యువకుల పాత్రలో చక్కగా నటించారు. వీరు నలుగురు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హీరోయిజాలు చూపిస్తూ తెగ యాక్షన్ సీక్వెన్సులు చూపించే కారెక్టర్లు కాకపోవడంతో మరింత ఈజీగా నటించేశారు. ఆ నలుగురి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగానే ఉంది. అయితే ఆ పాత్రకు డబ్బింగ్ మాత్రం అంతగా సూట్ అయినట్టు కనిపించదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి. ఎలా ఉందంటే? ఈ మధ్య కామెడీ అడల్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ తీస్తోన్న ఈ సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలకు కొదవే లేకుండాపోతోంది. ఓటీటీలో అడల్ట్ జానర్లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆవారా జిందగీ అటువంటి జానర్లోకే వస్తుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది. తినడం,తిరగడం, తాగడం అనే సీన్లతోనే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి కాస్త కథనం మారుతుంది. చేజింగ్ సీన్లు, అడల్ట్ సీన్లు ఎక్కువగా వస్తుంటాయి. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగా కాకుండా రియాల్టీకి దగ్గరగా ఉండేలా చేశాడు. అక్కడే దర్శకుడి టేస్ట్ కనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ నాచురల్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్ సహజంగానే వచ్చినట్టుగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బూతు డైలాగ్‌లకు బీప్ సౌండ్లు పడ్డాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
నలుగురి ఆవారా కుర్రాళ్ల కథే ‘మా ఆవారా జిందగీ’
ఆవారాగా తిరిగే నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘మా ఆవారా జిందగీ’. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మా ఆవారా జిందగీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. జూన్ 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. (చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!) ఈ మూవీలో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’అని నటుడు శ్రీహాన్ అన్నారు.‘ఫస్ట్ టైం సినిమాలో నటిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’అని నటుడు అజయ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నటుడు చెర్రీ, మహేందర్ నాథ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.