ఆవారాగా తిరిగే నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘మా ఆవారా జిందగీ’. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మా ఆవారా జిందగీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు
చిత్ర దర్శకుడు దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..నలుగురి ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? అనే ఫన్ ఓరియెంటెడ్, యూత్ ఫుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ నవ్వుకునేలా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుంది. జూన్ 23 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
(చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్!)
ఈ మూవీలో బోల్డ్ సబ్జెక్టు ఉన్నా నా నుంచి అందరూ ఇలాంటి బోల్డ్ సబ్జెక్ట్ వస్తుందని ఊహించరు. నన్ను ఇష్టపడే వాళ్ళు నా యాక్టింగ్ ను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. ఈ కథకు మమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’అని నటుడు శ్రీహాన్ అన్నారు.‘ఫస్ట్ టైం సినిమాలో నటిస్తున్నాను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’అని నటుడు అజయ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నటుడు చెర్రీ, మహేందర్ నాథ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment