VR7: Mehreen, Anikha Surendran to Act With Vasanth Ravi - Sakshi
Sakshi News home page

Vasanth Ravi: రజనీకాంత్‌ రీల్‌ తనయుడు హీరోగా కొత్త సినిమా, ఇద్దరు హీరోయిన్లతో..

Published Sun, Aug 13 2023 9:43 AM | Last Updated on Sun, Aug 13 2023 10:50 AM

VR7: Mehreen, Anikha Surendran To Act with Vasanth Ravi - Sakshi

జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్‌ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమ

సినిమాల్లో కేవలం హీరోయిన్ల కోసం వచ్చే ప్రేక్షకులూ ఉంటారన్నది వాస్తవం. కొన్నిసార్లు ఈ కారణంగానే దర్శక నిర్మాతలు యువ హీరోల సరసన ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు. తాజాగా హీరో వసంత రవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు వసంత రవి. ఆ తర్వాత రాఖి చిత్రంతో యాక్షన్‌ హీరోగా విజయాన్ని అందుకున్నారు.

ఇటీవల అశ్విన్స్‌ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌ కొడుకుగా విభిన్న పాత్రను పోషించి శభాష్‌ అనిపించుకున్నారు. కాగా వసంత రవి ఇప్పుడు కథానాయకుడిగా తన ఏడవ చిత్రానికి సిద్ధమయ్యారు. జేఎస్‌ఎం పిక్చర్స్‌, ఎంపీరర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శబరీష్‌ నందా దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా వసంత రవికి జంటగా పటాస్‌, నోటా చిత్రాల ఫేమ్‌ మెహ్రీన్‌, హీరోయిన్‌ అనికా సురేంద్రన్‌ నటిస్తున్నారు. అజ్మల్‌ దాసిన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రం కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. టైటిల్‌ సహా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నాడు.

చదవండి: Varun Dhawan: కొత్త సినిమా.. గాయపడ్డ హీరో వరుణ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement