తెలుగులో ఎంట్రీ.. ఛాన్సుల కోసం దాన్నే నమ్ముకున్న బ్యూటీ! | kollywood Actress Anikha Surendran Latest Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Anikha Surendran: ఆ విషయంలో తగ్గేదేలే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్..!

Apr 11 2024 7:10 AM | Updated on Apr 11 2024 7:10 AM

kollywood Actress Anikha Surendran Latest Pics Goes Viral - Sakshi

సినిమాల్లో తన గ్లామర్‌ పవర్‌ చూపిస్తోన్న నటి అనికా సురేందర్‌. బాలా నటిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళ కుట్టి, ఆ తరువాత కోలీవుడ్‌, టాలీవుడ్‌ అంటూ తన స్థాయిని విస్తరించుకుంది. తమిళంలో అజిత్‌ హీరోగా నటించిన ఎనై అరిందాల్‌(తెలుగులో ఎంతవాడు కానీ) చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంలో చిన్న నయనతారగా నటించింది. దీంతో అందరూ అనికా సురందర్‌ను చిన్న నయనతార అని కూడా పిలుస్తుంటారు.

అదే విధంగా ఆ అరువాత అజిత్‌, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన విశ్వాసం చిత్రంలో వారి కూతురిగా నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చాలా మంది బాల తారల మాదిరిగానే ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని తెలుగు చిత్రం బుట్టబొమ్మతో అందుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో తదుపరి అవకాశం కోసం అనికా సురేంద్రన్ శక్తికి మంచి ప్రయత్నిస్తూనే ఉందని చెప్పవచ్చు. 

అందుకు ఈ చిన్నది గ్లామర్‌పైనే ఆధారపడుతోంది. అలా ఎంత వరకూ చేరుకుందంటే ఇప్పుడు మరో సిల్క్‌ స్మిత అనిపించుకునే వరకూ. అవును ఆ రేంజ్‌కు అనికా సురేందర్‌ గ్లామరస్‌ ఫొటోలను ప్రత్యేకంగా తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. కాగా తాజాగా నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఆయన 50వ చిత్రంలో అనికా సురేందర్‌ ఒక ముఖ్య భూమికను పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడుతుందనే ఆశతో ఉంది. అయితే తన గ్లామరస్‌ ఫొటోలను విడుదల చేయడంలో మాత్రం తగ్గేదే లేదంటోందీ మలయాళ కుట్టి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement