'మరో ఏడాదికి బుక్కయ్యాడు' | 190 prabhas working days locked for bahubali 2 | Sakshi
Sakshi News home page

'మరో ఏడాదికి బుక్కయ్యాడు'

Published Fri, Nov 6 2015 10:36 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'మరో ఏడాదికి బుక్కయ్యాడు' - Sakshi

'మరో ఏడాదికి బుక్కయ్యాడు'

బాహుబలి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అన్న విషయాన్నిపక్కనపెడితే ఈ సినిమా ప్రభాస్ను పర్సనల్గా,  ప్రొఫెషనల్గా కూడా చాలా ఇబ్బంది పెడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి తొలి భాగం కోసం దాదాపు మూడేళ్ల పాటు మరే సినిమా చేయకుండా పనిచేసిన ప్రభాస్, సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్, సక్సెస్ టూర్ అంటూ బిజీ బిజీగా గడిపేశాడు. ఈ గ్యాప్లో మరో సినిమాతో పాటు, పెళ్లి తంతు కూడా కానిచ్చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు.

త్వరలోనే బాహుబలి టీం సీక్వల్ షూటింగ్ను మొదలు పెట్టనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న బాహుబలి 2 షూటింగ్ను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి,  తొలి భాగం సక్సెస్ ఇచ్చిన జోష్తో మరింత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్లాన్ చేసిన చిత్రయూనిట్ 190 వర్కింగ్ డేస్లో ఈ సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే షూటింగ్ మధ్యలో తీసుకునే గ్యాప్లను కూడా కలుపుకుంటే దాదాపు మరో పదినెలల పాటు బాహుబలి 2 షూటింగ్ జరగనుందన్న టాక్ వినిపిస్తోంది.

ఆ తరువాత సినిమా ప్రమోషన్, రిలీజ్, సక్సెస్మీట్లంటూ మరో రెండు, మూడు నెలల సమయం ఖర్చయిపోతుంది.  అంటే ఈ ఏడాది కూడా ప్రభాస్ అభిమానులకు నిరాశే అన్న వాదన ప్రస్తుతం టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కే నెక్ట్స్ సినిమాను జూలై 2016లో ప్రారంభిస్తారని చెబుతున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement