'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్ | hollywood star nathan jones in bahubali 2 | Sakshi
Sakshi News home page

'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్

Published Wed, Nov 11 2015 9:25 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్ - Sakshi

'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్

బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఆ సినిమా సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండిస్తున్నా, గాసిప్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త మీడియాలో వినిపిస్తోంది. బాహుబలి 2 సినిమా కోసం హాలీవుడ్ నటుణ్ణి విలన్గా ఎంపిక చేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి లాంటి సినిమాల్లో విలన్గా నటించిన నతన్ జాన్స్ను ఈ సినిమాలో విలన్గా ఎంపిక చేశారట. ఇప్పటికే జయం రవి హీరోగా నటించిన 'భూలోగం' సినిమాలో నటించిన జోన్స్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న 'ఫ్లైయింగ్ జాట్' సినిమాలోనూ విలన్గా నటిస్తున్నాడు.

ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోవటంతో అభిమానులతో సినీ వర్గాలు కూడా బాహుబలి యూనిట్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2 డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement