nathan jones
-
గౌతమీపుత్రుడితో ఢీ!
ప్రతినాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే కథకు తగ్గ హీరోని ఎంపిక చేసే విషయంలో కేర్ తీసుకోవడంతో పాటు విలన్ని ఎంపిక చేసే విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటారు. భారతదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తాను రాసుకున్న కథ బాలకృష్ణకు మాత్రమే సూట్ అవుతుందనుకున్నారు క్రిష్. ఈ కథ విన్న బాలకృష్ణ తన నూరవ చిత్రానికి ఇలాంటి కథే కరెక్ట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గౌతమీపుత్రుడికి దీటైన విలన్ కోసం క్రిష్ చాలా అన్వేషించారట. ఫైనల్‌గా హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ అయితే బాగుంటుందని ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. స్వతహాగా మల్లయోధుడైన నాథన్‌కి నటుడిగా ‘ట్రాయ్’ మూవీ చాలా పేరు తెచ్చింది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన తమిళంలో ‘భూలోగం’ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘ఎ ఫ్లయింగ్ జాట్’లో విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ఎంపికయ్యారని ఫిలిం నగర్ టాక్. ప్రపంచాన్ని జయించాలనే ఆశయంతో దండయాత్రలు చేసే గ్రీకురాజుగా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ- నాథన్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. -
బాలయ్య సినిమాలో హాలీవుడ్ విలన్
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం విదేశాల్లో మరో భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో సినిమాకు సంబందించిన మరో వార్త నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యతో ఓ హాలీవుడ్ విలన్ ఢీ కొనబోతున్నాడు. ట్రాయ్ సినిమాలో నటించిన ఇంగ్లీష్ వినల్ నూతన్ జోన్స్ బాలయ్య సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ప్రపంచాన్ని జయించాలన్న ఆశయంతో వరుస దండయాత్రలు చేసే గ్రీకు రాజుగా కనిపించనున్నాడు జోన్స్. ప్రస్తుతం జార్జీయాలో జరుగుతున్న షెడ్యూల్ లోనే నూతన్ జోన్స్‌తో యుద్ద సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. -
'బాహుబలి 2'లో హాలీవుడ్ విలన్
బాహుబలి ఘనవిజయం సాధించటంతో ఆ సినిమా సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను చిత్రయూనిట్ ఖండిస్తున్నా, గాసిప్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆసక్తి కరమైన వార్త మీడియాలో వినిపిస్తోంది. బాహుబలి 2 సినిమా కోసం హాలీవుడ్ నటుణ్ణి విలన్‌గా ఎంపిక చేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ట్రాయ్, మ్యాడ్ మాక్స్ ఫ్యూరి లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన నతన్ జాన్స్ను ఈ సినిమాలో విలన్‌గా ఎంపిక చేశారట. ఇప్పటికే జయం రవి హీరోగా నటించిన 'భూలోగం' సినిమాలో నటించిన జోన్స్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న 'ఫ్లైయింగ్ జాట్' సినిమాలోనూ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోవటంతో అభిమానులతో సినీ వర్గాలు కూడా బాహుబలి యూనిట్ స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న బాహుబలి 2 డిసెంబర్ తొలి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బాలీవుడ్లో ఇలాంటి నటుణ్ని చూడలేదు
బాలీవుడ్ తెరమీద సూపర్ హీరో చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. మిస్టర్ ఇండియా నుంచి క్రిష్ సిరీస్ వరకు ఆ జానర్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే జానర్లో మరో ఆసక్తికరమైన సినిమా వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ వారసుడు టైగర్ ష్రాఫ్ హీరోగా కొరియోగ్రఫీ నుంచి డైరెక్టర్‌గా మారిన రెమో డిసౌజా దర్శకత్వంలో 'ఫ్లైయింగ్ జాట్' సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ నతన్ జోన్స్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడు. రెజలర్గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నతన్ 'మ్యాడ్ మాక్స్ ఫ్యూరి' సినిమాతో నటుడిగా కూడా మంచి మార్కులు సాధించాడు. ఈ హాలీవుడ్ స్టార్ 'ఫ్లైయింగ్ జాట్' సినిమాలో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు. విలన్‌గా పోరాట సన్నివేశాలు చేసే సమయంలో నతన్ 10 కేజీలకు పైగా బరువుండే ఓ భారీ ఆయుధాన్ని గంటల తరబడి మోయాల్సి వచ్చింది. దీంతో యూనిట్ సభ్యులు డమ్మీ వెపన్తో షూటింగ్ పూర్తిచేసి తరువాత గ్రాఫిక్స్‌తో దాన్ని ఒరిజినల్‌గా చూపించాలని భావించారు. నతన్ జోన్స్ మాత్రం అందుకు అంగీకరించకుండా ఆ భారీ ఆయుధంతో రోజుకు పది గంటలు షూటింగ్లో పాల్గొన్నాడు. నతన్ జోన్స్ ప్రొఫెషనలిజం చూసిన దర్శకుడు రెమో డిసౌజా బాలీవుడ్లో ఇంతవరకు ఇలాంటి నటుడిని చూడలేదంటూ కితాబిచ్చాడు.