బాలీవుడ్లో ఇలాంటి నటుణ్ని చూడలేదు | remo desouza amazed at nathan jones professionalism | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో ఇలాంటి నటుణ్ని చూడలేదు

Published Thu, Oct 29 2015 11:09 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

బాలీవుడ్లో ఇలాంటి నటుణ్ని చూడలేదు

బాలీవుడ్లో ఇలాంటి నటుణ్ని చూడలేదు

బాలీవుడ్ తెరమీద సూపర్ హీరో చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. మిస్టర్ ఇండియా నుంచి క్రిష్ సిరీస్ వరకు ఆ జానర్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే జానర్లో మరో ఆసక్తికరమైన సినిమా వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ వారసుడు టైగర్ ష్రాఫ్ హీరోగా కొరియోగ్రఫీ నుంచి డైరెక్టర్గా మారిన రెమో డిసౌజా దర్శకత్వంలో 'ఫ్లైయింగ్ జాట్' సినిమా తెరకెక్కుతోంది.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ నతన్ జోన్స్ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నాడు. రెజలర్గా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నతన్ 'మ్యాడ్ మాక్స్ ఫ్యూరి' సినిమాతో నటుడిగా కూడా మంచి మార్కులు సాధించాడు. ఈ హాలీవుడ్ స్టార్ 'ఫ్లైయింగ్ జాట్' సినిమాలో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు.

విలన్గా పోరాట సన్నివేశాలు చేసే సమయంలో నతన్ 10 కేజీలకు పైగా బరువుండే ఓ భారీ ఆయుధాన్ని గంటల తరబడి మోయాల్సి వచ్చింది. దీంతో యూనిట్ సభ్యులు డమ్మీ వెపన్తో షూటింగ్ పూర్తిచేసి తరువాత గ్రాఫిక్స్తో దాన్ని ఒరిజినల్గా చూపించాలని భావించారు. నతన్ జోన్స్ మాత్రం అందుకు అంగీకరించకుండా ఆ భారీ ఆయుధంతో రోజుకు పది గంటలు షూటింగ్లో పాల్గొన్నాడు. నతన్ జోన్స్  ప్రొఫెషనలిజం చూసిన దర్శకుడు రెమో డిసౌజా బాలీవుడ్లో ఇంతవరకు ఇలాంటి నటుడిని చూడలేదంటూ కితాబిచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement