బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా! | Bahubali 2: Insured for Rs 200 crore, collections Rs 782 crore | Sakshi
Sakshi News home page

బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!

Published Fri, May 5 2017 12:20 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా! - Sakshi

బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!

‘బాహుబలి–2’ సినిమాకి రూ.200 కోట్లమేర నిర్మాతలు బీమా చేయించారు. ప్రైవేట్‌ రంగ ఫ్యూచర్‌ జెనరాలి ఇన్సూరెన్స్‌ కంపెనీ తన ఫిల్మ్‌ ప్యాకేజ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద ఈ కవరేజ్‌ను ఆఫర్‌ చేసింది. సినిమా ప్రి–ప్రొడక్షన్, పోస్ట్‌–ప్రొడక్షన్‌ సమయంలో అనుకోని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలన్నింటినీ ఈ కవరేజ్‌ భర్తీచేస్తుందని ఫ్యూచర్‌ జెనరాలి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సినిమాలోని నటీనటులు మరణించడం, అనారోగ్యానికి గురవడం సహా సహజసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తు అనుకోని విధంగా షూటింగ్‌కు అంతరాయం కలిగించే అంశాలన్నింటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. షూటింగ్‌ సమయంలో పరికరాలకు డ్యామేజ్‌ జరిగితే దాన్ని కూడా పాలసీ కవర్‌ చేస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement