Rs 200 crore insurance
-
బాహుబలి–2కు రూ.200 కోట్ల బీమా!
‘బాహుబలి–2’ సినిమాకి రూ.200 కోట్లమేర నిర్మాతలు బీమా చేయించారు. ప్రైవేట్ రంగ ఫ్యూచర్ జెనరాలి ఇన్సూరెన్స్ కంపెనీ తన ఫిల్మ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఈ కవరేజ్‌ను ఆఫర్ చేసింది. సినిమా ప్రి–ప్రొడక్షన్, పోస్ట్–ప్రొడక్షన్ సమయంలో అనుకోని ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలన్నింటినీ ఈ కవరేజ్ భర్తీచేస్తుందని ఫ్యూచర్ జెనరాలి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సినిమాలోని నటీనటులు మరణించడం, అనారోగ్యానికి గురవడం సహా సహజసిద్ధంగా లేదా ప్రమాదవశాత్తు అనుకోని విధంగా షూటింగ్‌కు అంతరాయం కలిగించే అంశాలన్నింటికీ ఈ పాలసీ వర్తిస్తుంది. షూటింగ్ సమయంలో పరికరాలకు డ్యామేజ్ జరిగితే దాన్ని కూడా పాలసీ కవర్ చేస్తుంది. -
'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్!
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటించిన కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'లింగా' చిత్రాన్ని నిర్మాత 200 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే. రజనీకాంత్ పుట్టిన రోజు ఈ నెల 12న ఈ సినిమా విడుదలకానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. సెన్సార్ బోర్డ్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. **