నా జీవితంలో రాజకీయాల్లోకి రాను: హీరో | Shah Rukh Khan: Don't want to associate with politics ever | Sakshi
Sakshi News home page

నా జీవితంలో రాజకీయాల్లోకి రాను: హీరో

Published Tue, Jan 31 2017 7:09 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

నా జీవితంలో రాజకీయాల్లోకి రాను: హీరో - Sakshi

నా జీవితంలో రాజకీయాల్లోకి రాను: హీరో

ముంబై: తన జీవితంలో రాజకీయాల్లోకి రానని, రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని బాలీవుడ్‌ బాద్షా షారుక్ ఖాన్ అన్నాడు. తనకు నటన మాత్రమే ఇష్టమని, తాను సినిమా హీరోనని, జీవితాంతం నటుడిగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పాడు. రాజకీయాల గురించి తనకు ఏమీ తెలియదని, ఏ మాత్రం ఆసక్తి కూడా లేదని అన్నాడు.

షారుక్ నటించిన తాజా చిత్రం రేయీస్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రేయీస్తో పాటు హృతిక్ రోషన్ నటించిన కాబిల్‌ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. షారుక్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రతి సినిమాకు స్థానం, బిజినెస్ ఉంటుందని చెప్పాడు. ఏ సినిమా కూడా మరో సినిమాకు పోటీ కాదని, బిజినెస్ను దెబ్బతీయదని అభిప్రాయపడ్డాడు. తాము ఊహించినదాని కంటే రేయీస్ ఎక్కువ బిజినెస్ చేసిందని షారుక్ చెప్పాడు. రాహుల్‌ దోలకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement