
షారూఖ్ సినిమాలో బాహుబలి
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. తొలి భాగంతో రికార్డ్ కలెక్షన్లు సాధించిన బాహుబలి, ఇప్పుడు సీక్వల్తో మరింత గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి పార్ట్ 2, ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు.
తొలి భాగానికి చేసినట్టుగానే మూడు నెలల ముందు నుంచే పబ్లిసిటీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం తొలి టీజర్ను షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన రాయిస్తో పాటు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షారూఖ్ స్మగ్లర్గా కనిపిస్తోన్న రాయిస్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నరాయిస్తో పాటు బాహుబలి టీజర్ను రిలీజ్ చేస్తే సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.