రాయిస్ ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్ | Shah rukh Khan Raees trailer release | Sakshi
Sakshi News home page

రాయిస్ ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

Published Wed, Dec 7 2016 3:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

రాయిస్ ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

రాయిస్ ట్రైలర్కు సూపర్ రెస్పాన్స్

కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్, ఓ పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 80ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్, గుజరాత్లో స్మగ్లింగ్ చేసే రాయిస్ అలాంగా కనిపిస్తున్నాడు. షారూఖ్ ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తున్నాడు.

రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్కే రిలీజ్ చేయాలని భావించినా.., అదే సమయంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది. భారీ అంచనాలున్న రాయిస్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. షారూఖ్ మాస్ లుక్లో ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement