ఆన్‌లైన్‌లో ‘లైలా’ దుమ్మురేపుతోంది! | Sunny Leone special song went viral | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!

Published Thu, Dec 22 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

ఆన్‌లైన్‌లో ‘లైలా’  దుమ్మురేపుతోంది!

ఆన్‌లైన్‌లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!

బాలీవుడ్‌ శృంగార భామ సన్నీ లియోన్‌.. ’లైలా మై లైలా’ అంటూ ఉర్రూతలూగిస్తోంది. తొలిసారి షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు.. అదరగొట్టే స్టెప్పులు, టీజింగ్‌ లుక్‌తో  ఆకట్టుకుంది. షారుఖ్‌ఖాన్‌ తాజా చిత్రం ’రాయిస్‌’లో ఓ స్పెషల్‌ ఐటెం సాంగ్‌లో నర్తించిన సన్నీ.. ఊహించినట్టే తన అందచందాలతో మతిపోగోడుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. షారుఖ్‌ గంభీరమైన లుక్ కనిపించగా‌.. ఐటెం సాంగ్‌కు కావాల్సిన ఘాటైన హుషారెత్తించే డ్యాన్స్‌లతో  సన్నీ అలరించింది.

కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్ 80వ దశకంనాటి కథతో 'రాయిస్'గా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుజరాత్కు చెందిన స్మగ్లర్‌గా కనిపించనుండగా.. అతని ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటిస్తున్నాడు. రాహుల్ దోలాఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షారూఖ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. 2017 జనవరి 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా హృతిక్ హీరోగా తెరకెక్కిన కాబిల్తో పోటిపడుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement