ఖాన్ల మధ్య పోటీ లేనట్టే | Sharukh Khan next film raees postponed | Sakshi
Sakshi News home page

ఖాన్ల మధ్య పోటీ లేనట్టే

Published Sun, Apr 10 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

Sharukh Khan next film raees postponed

బాలీవుడ్ ఇండస్ట్రీలో రంజాన్ సీజన్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్లో తలపడినట్టుగా బాలీవుడ్లో రంజాన్ సీజన్లో స్టార్ హీరోలు పోటీ పడతారు. అదే బాటలో ఈ సారి కూడా రసవత్తరమైన పోటీ తప్పదని భావించాయి సినీ వర్గాలు. అయితే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశాడు షారుక్. తన పాత మిత్రుడు సల్మాన్ ఖాన్తో ఈ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాడటంతో పోటీ వద్దని పక్కకు తప్పుకున్నాడు.
 
ప్రేమ్ రతన్ థన్ పాయో సినిమా తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న సినిమా సుల్తాన్. గత సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో సుల్తాన్ సినిమాను ఎలాగైన హిట్ చేయాలన్న కసితో సినిమా చేస్తున్నాడు కండలవీరుడు. ఇక షారూక్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దిల్ వాలే సినిమాతో అభిమానులను నిరాశపరిచిన షారుక్, రాయిస్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. దీంతో తాజా చిత్రాలు ఇద్దరు ఖాన్లకు కీలకం కానున్నాయి.
 
ఈ రెండు సినిమాలు ప్రారంభమైన సమయంలో ఈద్కే రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించేశారు చిత్రయూనిట్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే బాజీరావ్ మస్తానీతో పోటీ పడి నష్టపోయిన షారుక్ ఖాన్ మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడు. అందుకే తానే ఓ అడుగు వెనక్కు వేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న సమయానికన్నా రెండు వారాలు ఆలస్యంగా రాయిస్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement