స్టార్ హీరోల సినీ సంగ్రామం! | No more box office clash for Salman, Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోల సినీ సంగ్రామం!

Published Mon, Apr 11 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

స్టార్ హీరోల సినీ సంగ్రామం!

స్టార్ హీరోల సినీ సంగ్రామం!

పెద్ద హీరోల సినిమాలు వస్తుంటే, చిన్న సినిమాలన్నీ పక్కకు తొలగి, దారి ఇవ్వడం రెగ్యులర్‌గా చూసే విషయమే. అలాగే, ఒక పెద్ద హీరో సినిమాకూ, మరో పెద్ద హీరో సినిమాకూ మధ్య కనీసం రెండు వారాలైనా గ్యాప్ ఉండేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటూ ఉంటారు. తద్వారా రెండు సినిమాలకూ కలెక్షన్లలో ఇబ్బంది తగలకుండా జాగ్రత్తపడతారు. కానీ, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజైతే? అదీ హిందీ చిత్రసీమలో... పైగా రంజాన్ పండుగ సీజన్‌లో అయితే? పరిస్థితి చూస్తుంటే, ఇప్పుడు అదే జరిగేలా ఉంది.

సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సుల్తాన్’, షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘రాయీస్’ చిత్రాలు రెండూ ఈ ఏడాది రంజాన్ పండుగ వేళ రిలీజయ్యేందుకు పోటీపడుతున్నాయి. నిజానికి, ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల దగ్గరా పలువురు ప్రస్తావించారు. ఈ పోరాటాన్ని నివారించేందుకు ఏదో ఒక దోవ చూస్తామని ఇద్దరూ అన్నారు. అయితే, ఇప్పటి వరకు ఆ దోవ ఏదో తెలిసినట్లు కనిపించడం లేదు. తాజాగా ‘ఫ్యాన్’ చిత్ర ప్రచారంలో ఉన్న షారుఖ్ దగ్గర మళ్ళీ ఈ బాక్సాఫీస్ సంగ్రామం గురించి ప్రస్తావన వచ్చింది. ‘‘ఇది పరమ వికారమైన విషయం.

ఒక సినిమా వ్యాపారాన్ని మరొక సినిమా తినేసేలా ఒకే రోజు రిలీజ్ చేసే కన్నా, సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవడం మంచిది. రంజాన్‌కు ఇంకా రెండు, మూడు నెలల టైమ్ ఉంది కదా! మేము కూర్చొని, మాట్లాడుకొని, నిర్ణయించుకొని, ఏదో ఒక పరిష్కారం చూస్తాం’’ అని షారుఖ్ అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో రంజాన్ వచ్చిందంటే, సల్మాన్‌ఖాన్ సినిమా ఉండాల్సిందే. గత ఏడాది వచ్చిన ‘బజ్‌రంగీ భాయీజాన్’ ఎంత హిట్టో తెలిసిందే.

కాబట్టి, రంజాన్ సీజన్ సల్మాన్‌దే అని ఫిక్స్ అయితే ఏం చేస్తామన్నారు షారుఖ్. ‘‘నేను ఫలానా ఈ స్టార్ కన్నా ఫలానా ఆ స్టార్ పెద్దవాడని నేను అనడం లేదు. కానీ, ‘సుల్తాన్’ చిత్ర నిర్మాత ఆదిత్యా చోప్రా సహా ఇతరులూ నా ఫ్రెండ్సే. కాబట్టి, అందరితో మాట్లాడి, సమస్య పరిష్కరించాలనుకుంటున్నా’’ అన్నారు. మొత్తానికి, షారుఖ్ జోక్యంతో ఈ బాలీవుడ్ బాక్సాఫీస్ సంగ్రామం ఆగుతుందని ఆశించవచ్చా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement