కొంత కాలంగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించటంలో ఫెయిల్ అవుతున్న షారూఖ్, ఓ పీరియాడిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 80ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్, గుజరాత్లో స్మగ్లింగ్ చేసే రాయిస్ అలాంగా కనిపిస్తున్నాడు. షారూఖ్ ఆట కట్టించేందుకు ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ గులామ్ పటేల్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపిస్తున్నాడు.