మూవీలో సత్తా ఉండాలి.. అంతే కానీ..!
నోయిడా: అనుష్కా శర్మ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఏ దిల్ హై ముష్కిల్’.ఆమె ప్రియుడిగా బాలీవుడ్ నటుడు ఫవాద్ ఖాన్ నటిస్తున్నాడు. ఫవాద్ నటుడు మాత్రమే కాదు ప్లే బ్యాక్ సింగర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. తొలి మూవీ ఖుబ్సురత్ విడుదల నుంచీ జిందగీ గుల్జార్ హై వరకు తనదైన నటనతో అందరినీ మెప్పిస్తున్న ఫవాద్ సినిమాల విషయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. మూవీలో కంటెంట్ ఉంటే చాలు సరిపోతుంది, మల్టీ స్టారర్ అయితేనే హిట్ అవుతుందని తాను భావించడం లేదన్నాడు. క్రియేటివ్ రోల్ ఏది వచ్చినా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం బెటర్ ఆప్షన్ అంటున్నాడు. ఆ మూవీలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ కీలక పాత్రలు పోషించారు.
మల్టీ స్టారర్ మూవీలలో ఎక్కువగా ఎంచుకుంటున్నారని విలేకరి అడిగిన ప్రశ్నపై భిన్నంగా స్పందించి ఈ విషయాలు చెప్పాడు. కాన్పెప్ట్ నచ్చితే అన్ని రకాల మూవీలు చేస్తానని, అయితే ఎంచుకునే పాత్రపై కాస్త అవగాహన ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు. మరో కొత్త మూవీ 'కపూర్ అండ్ సన్స్' గే పాత్రలో ఫవాద్ కనిపించనున్నాడు. పాకిస్తానీ సినిమాలు మాత్రమే కాదు బాలీవుడ్ మూవీలను ఎంతో ఇష్టపడతానని చెప్పాడు. పలానా మూవీలు మాత్రమే చేయాలని అని భావించడానికి ఇవేమీ ప్రభుత్వ నిర్ణయాలు కాదని, మనసుకు నచ్చే పాత్రలు చేస్తూ కెరీర్ సాఫీగా సాగేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫవాద్ తన మనసులో మాటను బయటపెట్టాడు.