ఆ సినిమాను నిషేధించాల్సిందే..
ముంబై : ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలపై వివాదం మరింత ముదురుతోంది. ఆ సినిమా విడుదల విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తేల్చి చెబుతోంది. పోలీసులు కేసులో పెట్టినా తాము భయపడేది లేదని ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే స్పష్టం చేశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను నిషేధించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బాలీవుడ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పాకిస్థాన్ నటుడు పవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. కేంద్రం హామీ ఇచ్చినా ఎమ్ఎన్ఎస్ మాత్రం తన పట్టు వీడటం లేదు.