Mukesh Bhatt
-
దర్శకుడి పాదాలకు నమస్కరించిన హీరోయిన్, వీడియో వైరల్
సమ్మర్‌కు ముగింపు పలుకుతూ ఈ రోజు (మే 31) బోలెడన్ని సినిమాలు రిలీజయ్యాయి. తెలుగులో భజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గంగం గణేశా విడుదలవగా థియేటర్లకు పండగ కళ వచ్చింది. అటు బాలీవుడ్లో నిన్న మిస్టర్ అండ్ మిసెస్ రిలీజవగా నేడు 'సవి: ఎ బ్లడీ హౌస్‌వైఫ్' మూవీ విడుదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ చిత్రంలో జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించగా సవి చిత్రంలో దివ్య ఖోస్లా కుమార్ హీరోయిన్గా నటించింది.నేను ఫైటర్‌ను..తన సినిమా రిలీజ్ సందర్భంగా దివ్య.. సీనియర్ దర్శకనటుడు ముకేశ్ భట్ పాదాలకు నమస్కరించింది. వెంటనే ముకేశ్ ఆమెను వద్దని మందలిస్తూ హత్తుకుని ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సినిమా ఫలితాలపై గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించకపోతే ఏడుస్తూ కూర్చోను. నేనొక ఫైటర్‌ను. జీవితంలో దేనికీ భయపడను. జయాపజయాల గురించి తలుచుకుని కుంగిపోను. ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను అని చెప్పుకొచ్చింది.ఆ పదం తొలగించడంతో..కాగా దివ్య ఖోస్లా కుమార్ ఇటీవల తన పేరులో నుంచి కుమార్ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఆమె భర్త, టీ సిరీస్ యజమాని భూషణ్ కుమార్‌తో విడిపోయిందా? అని రూమర్స్ వెలువడ్డాయి. దీనిపై వెంటనే స్పందించిన దివ్య.. న్యూమరాలజీ ప్రకారమే ఆ పదాన్ని తొలగించినట్లు వివరణ ఇచ్చింది. తెలుగు సినిమాతో ఎంట్రీఇకపోతే దివ్య ఖోస్లా కుమార్.. లవ్ టుడే అనే తెలుగు చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. అదే ఏడాది హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో దర్శకురాలిగా, నిర్మాతగానూ ప్రయోగాలు చేసింది. చివరగా యారియాన్ 2 సినిమాలో కనిపించింది. ఆమె నటించిన సవి నేడే రిలీజైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్ అనే ద్విభాషా సినిమా చేస్తోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మహేశ్ బాలీవుడ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయిన నిర్మాత
Mukesh Bhatt on Mahesh Babu: బాలీవుడ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలె ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత ముకేశ్ భట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఆయనకు కావాల్సిన సౌకర్యం బాలీవుడ్ ఇవ్వలేకపోవచ్చు అని అనుకోవడంలో తప్పులేదు. మహేశ్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో. మహేశ్ అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
ఫడ్నవీస్‌తో రాజ్ ఠాక్రే, కరణ్ జోహార్ భేటీ
ముంబయి: ‘ఏ దిల్ హై ముష్కిల్’ పంచాయితీ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు చేరింది. పాకిస్తాన్ నటులు నటించిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే, నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ముఖేష్ భట్ మాట్లాడుతూ భవిష్యత్‌లో పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయమని సీఎంకు హామీ ఇచ్చామన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ న్యూస్ రీల్‌ను ప్రదర్శించనున్నట్లు కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఫడ్నవీస్‌కు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కాగా దీపావళి సందర్భంగా దిల్ హై ముష్కిల్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. -
ఆ సినిమాను నిషేధించాల్సిందే..
ముంబై : ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలపై వివాదం మరింత ముదురుతోంది. ఆ సినిమా విడుదల విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తేల్చి చెబుతోంది. పోలీసులు కేసులో పెట్టినా తాము భయపడేది లేదని ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను నిషేధించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు బాలీవుడ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కరణ్ జోహర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో పాకిస్థాన్ నటుడు పవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు. కేంద్రం హామీ ఇచ్చినా ఎమ్ఎన్ఎస్ మాత్రం తన పట్టు వీడటం లేదు. -
'ఆ సినిమాపై హోంమంత్రి వందశాతం భరోసా'
న్యూఢిల్లీ: బాలీవుడ్ సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ సినిమా విడుదలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. దర్శకనిర్మాత మహేశ్ భట్ నేతృత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ అపూర్వ మెహతా, ఫాక్స్ స్టార్స్ విజయ్ సింగ్ తదితరులు గురువారం రాజ్ నాథ్ ను కలిశారు. భేటీ ముగిసిన తర్వాత మహేశ్ భట్ విలేకరులతో మాట్లాడుతూ... హోంమంత్రి తమకు వందశాతం భరోసాయిచ్చారని తెలిపారు. 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరాతానని తమతో రాజ్ నాథ్ చెప్పినట్టు వెల్లడించారు. సినిమా విడుదలవుతున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తానని హామీయిచ్చినట్టు చెప్పారు. ఈ సినిమా చూడొద్దనుకున్న వారిని తాము బలవంతం చేయడం లేదని, అలాగే సినిమా చూసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం సరికాదని మహేశ్ భట్ అన్నారు. మన సినిమాలు, టీవీ కార్యక్రమాలను పాకిస్థాన్ అడ్డుకోవడం పెద్ద విషయం కాదన్నారు. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంటాయని, పాకిస్థాన్ లో విడుదల చేయకున్నా పెద్దగా నష్టం ఉండదని వివరించారు. కరణ్ జోహార్ తెరకెక్కించిన 'ఏ దిల్ హై ముష్కిల్'లో పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడన్న కారణంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బాహుబలికి మరో గౌరవం
భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై 7 నెలలవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాహుబలి పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే కలెక్షన్లతో పాటు అవార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి ఇప్పుడు మరో ఘనత సాధించింది. 2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించి మరోసారి వార్తల్లో నిలిచింది బాహుబలి. ఎవరు ఊహించని స్థాయి భారీచిత్రాన్ని రూపొందించినందుకు గాను ఈ ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది గిల్డ్ అవార్డ్స్ జ్యూరీ. ఈ సందర్భంగా అవార్డ్ ప్రధానం చేసిన ముఖేష్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఎవరు చేయలేని ఓ సాహసం చేసిన నిర్మాత, దర్శకుడు, చిత్రయూనిట్ గురించి మాట్లడటం ఎంతో గర్వంగా ఉంది. రాజమౌళీ.. నువ్వు మరిన్ని చిత్రాలతో మేము గర్వించేలా చేయాలి' అన్నారు. -
ముఖేశ్‌భట్ నా మార్గదర్శి
నిర్మాత ముఖేశ్భట్ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తానని, ఆయన తన మార్గదర్శి అని చెబుతున్నాడు వర్ధమాన నటుడు గుర్మీత్ చౌదరి. విశేష్ ఫిల్మ్స్ సంస్థతో మూడు చిత్రాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడాడు. బాలీవుడ్లో కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలనే విషయంలో ముఖేశ్‌భట్ తనకు మార్గదర్శిగా నిలుస్తున్నారని చెప్పాడు. ఆయన సూచనలు, సలహాలతోనే బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టానన్నాడు. ముఖేశ్‌తో మూడు చిత్రాల ఒప్పందం ఎలా కుదిరింది? అని అడిగిన ప్రశ్నకు గుర్మీత్ సమాధానమిస్తూ... ‘ముఖేశ్భట్ను అనేక సినిమా అవార్డుల ఫంక్షన్లో కలిసేవాడిని. ఆయన కూడా నన్ను గమనిస్తున్నాడనిపించేది. అనుకున్నట్లుగానే ఓ రోజు.. దక్షిణాఫ్రికాలో ఓ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. వెండితెర ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్‌కు, బుల్లితెర ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వచ్చింది. ఆ రోజు ముఖేశ్జీ నా దగ్గరకు వచ్చి... ‘నీతో కలిసి పనిచేయాలనుంది..!’ అని చెప్పారు. నా నోట మాట రాలేదు. ఆ తర్వాత మరుసటి రోజే ఆయన ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసు..’ అని చెప్పారు. ముఖేశ్ తనను సొంత కొడుకులా చూస్తాడని, అందుకే తన సంస్థలోని చిత్రాలతోపాటు మిగతా సంస్థల చిత్రాలను అంగీకరించే ముందు కూడా గుర్తుంచుకోవలసిన విషయాల గురించి చెబుతారన్నారు. ఇక ఆయనతో తొలి చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం జిమ్‌కు వెళ్లడం, స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, నటనకు సంబంధించి మరిన్ని మెళకువలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నాను. ‘అసలు నటనను కెరీర్‌గా ఎంచుకోవడమే విచిత్రంగా జరిగిపోయింది. అనుకోకుండా నాన్నతో కలిసి ఓసారి యశ్‌చోప్రాను కలిశాను. అప్పుడు ఆయన బుల్లితెరపై మొదట ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. షారుఖ్‌ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ముందు బుల్లితెర మీదే అనుభవం సంపాదించుకున్నారని, ఆ దారిలోనే నడవాలని సూచించారు. దీంతో రామాయణ్‌లో రాముడి పాత్ర దక్కింది. ఆ తర్వాత ముఖేశ్‌భట్ కారణంగా సినిమాల్లో అడుగుపెట్టాన’ంటూ తన తెరంగేట్రం గురించి చెప్పాడు. -
సృజనకు గుర్తింపు : ముఖేష్‌భట్
ముంబై : దర్శకులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సినిమాల ప్రదర్శనలతో పాటు చలనచిత్రోత్సవాలు కూడా దోహదపడతాయని ప్రముఖ దర్శకుడు , టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖే ష్ భట్ తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయం నానాటికీ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (ఎంఎఫ్ఎఫ్) సందర్భంగా శుక్రవారం జరి గిన ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న చిత్రాల అంతర్జాతీయ బయ్యర్లను ఆకర్షించేందుకు ఇటువంటి చిత్రోత్సవాలు ఎంతో ఉపకరిస్తాయని ఆయన అన్నారు. ఇటువంటి ఉత్సవాల వల్ల యువ దర్శకులు తమ ప్రతిభను, చిత్రాలను ప్రదర్శించడానికి అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నీలో ఉన్న సృజనాత్మకతను తగి న విధంగా ప్రదర్శించగలిగితే, నానాటికీ పెరిగిపోతున్న చిత్ర నిర్మాణ వ్యయాన్ని తట్టుకోగలిగే అవకాశముంటుంది. ఇటువంటి ఉత్సవాలు ప్రపంచం మన నుంచి ఆశిస్తున్న ప్రతి భను ప్రదర్శించేందుకు ఎంతో ఉపకరిస్తాయ’ని ఆయన అన్నారు. చిత్రోత్సవ నిర్వాహకుల్లో ఒకరైన స్పానిష్ ప్రతినిధి బృందాన్ని ఆయన కొనియాడారు. స్పెయిన్ వంటి దేశాల్లో నేను చాలా సార్లు పర్యటించాను. మన సంస్కృతీ సంప్రదాయాలకు స్పెయిన్‌తో దగ్గర సంబంధాలుంటాయి. స్పెయిన్ చాలా సుందరమైన దేశం. ఒక దర్శక నిర్మాతగా అక్కడ కనీసం 20 సినిమాలైనా తీయాలనుంది’ అని ముక్తాయించారు. స్పెయిన్‌లో సినిమా షూటింగ్‌లు, ఫైనాన్స్‌కు సంబంధించి బాధ్యత వహించే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, ఆడియో విజువల్ ఆర్ట్స్(ఐసీఏఏ) డెరైక్టర్ జనరల్ సుజా నాడిలా సియెరాతో కలిసి బాలీవుడ్ నటి నందితాదాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.