బాహుబలికి మరో గౌరవం | Bahubali Honoured with guild award | Sakshi
Sakshi News home page

బాహుబలికి మరో గౌరవం

Published Wed, Jan 6 2016 9:25 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలికి మరో గౌరవం - Sakshi

బాహుబలికి మరో గౌరవం

భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై 7 నెలలవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాహుబలి పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే కలెక్షన్లతో పాటు అవార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బాహుబలి ఇప్పుడు మరో ఘనత సాధించింది.

2015 గిల్డ్ అవార్డ్స్ లిస్ట్లో స్థానం సంపాదించి మరోసారి వార్తల్లో నిలిచింది బాహుబలి. ఎవరు ఊహించని స్థాయి భారీచిత్రాన్ని రూపొందించినందుకు గాను ఈ ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించింది గిల్డ్ అవార్డ్స్ జ్యూరీ. ఈ సందర్భంగా అవార్డ్ ప్రధానం చేసిన ముఖేష్ భట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఎవరు చేయలేని ఓ సాహసం చేసిన నిర్మాత, దర్శకుడు, చిత్రయూనిట్ గురించి మాట్లడటం ఎంతో గర్వంగా ఉంది. రాజమౌళీ.. నువ్వు మరిన్ని చిత్రాలతో మేము గర్వించేలా చేయాలి' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement